ధోనీపై స్టార్ హీరో కామెంట్.. ఆయనో ‘దబాంగ్’ ప్లేయర్’ అంటూ!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న ప్రత్యేకత ఎలాటిందో అందరికీ తెలిసిందే. పిచ్‌లో బ్యాట్ పట్టుకొని దిగాడంటే చాలు.. లక్ష్యం ఎంత పెద్దదైనా అది చిన్నగా మారాల్సిందే. బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ ఇలా అన్ని కేటగిరీల్లో రాణిస్తూ వచ్చిన ధోనీకి కోట్ల సంఖ్యలో అభిమానులున్నారు. ఆ లిస్టులో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
దేశంలోని సెలబ్రిటీల్లో ఎక్కువ మంది ధోనీ అభిమానులే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని చెప్పారు.

సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'దబాంగ్-3'. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన.. స్టార్ స్పోర్ట్స్‌లో వచ్చే 'క్రికెట్ లైవ్' అనే షోలో పార్టిసిపేట్ చేశారు. ఇతనితో పాటు ఈ సినిమాలో విలన్‌గా నటించిన సుదీప్‌తో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేదార్ జాదవ్‌తో తనకున్న అనుబంధం తెలుపుతూ ధోనీ తన అభిమాన క్రికెటర్ అని చెప్పారు. అంతేకాదు ధోనీ 'దబాంగ్' ప్లేయర్' అని సల్మాన్ పేర్కొన్నారు.
ఇక సుదీప్ విషయానికొస్తే.. ఎవరు బాగా ఆడితే.. వాళ్లే తన అభిమాన ఆటగాడు అని తెలిపాడు. తనకు అభిమాన క్రికెటర్ ఎవరూ లేరని సుదీప్ చెప్పాడు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే.. వాళ్లని ఇష్టపడతాను. అంతేకాక.. ఒక అభిమానిగా ప్రతి ఒక్క ఆటగాడిని గౌరవించాలని తాను భావిస్తానని సుదీప్ తెలిపాడు. సాధారణంగా అయితే తాను ఎప్పటికీ ఇష్టపడేది అనిల్ కుంబ్లే అని, రోహిత్ శర్మ అంటే కూడా ఇష్టమే అని ఆయన అన్నాడు.


Click it and Unblock the Notifications











