Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అల్లు అర్జున్‌కి అభిమానిగా మారిన మరో బాలీవుడ్ స్టార్ హీరో!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలెంట్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇండియాలోనే నెంబర్ వన్ డ్యాన్స్ స్కిల్స్ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఈ విషయం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరికి తెలుసు. బన్నీకి నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్. యూ ట్యూబ్ లో బన్నీ డబ్బింగ్ సినిమాలు చాలా వరకు వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. ఇక పాటల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
బన్నీ తన డ్యాన్స్ తోనే సినీ సెలబ్రెటీలను సైతం తన వైపుకు తిప్పుకుంటున్నాడు. గతంలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ చూసి తాను కూడా ఫిదా అయిపోయినట్లు చెప్పాడు. ఇక ఇప్పుడు మరొక బాలీవుడ్ హీరో కూడా బన్నీ స్టైలిష్ స్టెప్పులకు అభిమానిగా మారినట్లు చెబుతున్నారు. అతనెవరో కాదు.. కబీర్ సింగ్ సినిమాతో ఇటీవల బాక్సాఫీస్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్.
ఇటీవల అభిమానులతో సోషల్ మీడియా ద్వారా చాట్ చేసిన షాహిద్ అందులో బన్నీ గురించి ఒక అభిమాని ప్రశ్న వేయగా.. ఒక్క మాటతో బన్నీపై తనకున్న అభిమానాన్ని చూపించాడు. అల్లు అర్జున్ డ్యాన్స్ స్కిల్స్ నాకు చాలా ఇష్టం అంటూ.. నేను అతని మూమెంట్స్ ని లవ్ చేస్తానని షాహిద్ వివరణ ఇచ్చాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ మనోడి మాటలకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నెక్స్ట్ ఈ హీరో జెర్సీ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.