69 ఏళ్ల స్టార్ హీరోయిన్ ఆరుగురు హీరోలతో ప్రేమలో పడిందా? అయినా ఒంటరిగానే!

అందానికే అందం ఆమె. ఆ ముగ్ధమోహన సౌందర్యానికి ప్రతిఒక్కరూ ఫిదా అయినవారే. సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ ఫిల్మ్​ ఇండస్ట్రీకి వెళ్లి స్టార్ డమ్ సంపాదించుకున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఆమె ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోలతో ఆమె స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం 70లకు చేరువ అవుతున్నా ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్నారామె. అయితే ఆమె అప్పటి నుంచి ఇప్పటివరకు కాంట్రవర్సిలకు కేరాఫ్ అడ్రస్ అని అంటుంటారు. ఆమెనే సీనియర్ నటి రేఖ. అయితే ఈమె పర్సనల్​ లైఫ్​లో ఎంతో మంది స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు ఎప్పుడూ జోరుగా వస్తూనే ఉంటాయి. దాని గురించే ఈ కథనం..

ఏడు పదుల వయసుకు దగ్గర అవుతున్నా ఇంకా తన అందంతో ఆకట్టుకునే నటీమణుల్లో ఎవరైనా ఉన్నారా అంటే.. చాలా మందికి గుర్తొచ్చే పేరు రేఖనే ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులోనూ ఎంతో అందంగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. అసలు ఒకప్పుడు అబ్బాయిల గుండెల్లో ఆమె ఓ దేవత. తన పేరు వింటేనే అప్పట్లో కుర్రాళ్లకు గండె చప్పుడు పెరిగేదట. అందరూ అందాల దేవతలాగా ఆరాదించేవారట. అయితే ఈమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు, పుకార్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

Bollywood star heroine Rekha fall in love with six heroes News Goes Viral

సెక్రటరీతో రిలేషన్​షిప్​: అయితే ఆమె నటిగా కొనసాగుతోన్న సమయంలోనే ముఖేశ్‌ అగర్వాల్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన ఏడు నెలలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో రేఖపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఆమె అప్పటికే తన సెక్రటరీతో రిలేషన్​షిప్​లో ఉందని, ఈ రిలేషన్​షిపే ముఖేశ్​ మరణానికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం యాసర్ ఉస్మాన్ రచించిన రేఖ బయోగ్రఫీ 'రేఖ : ది అన్‌టోల్డ్‌ స్టోరీ'లో ఉంటుంది.

దీని కన్నా ముందు గతంలో రేఖ రిలేషన్​షిప్​ టాపిక్​ రాగానే ఎక్కువగా వినిపించే పేరు అమితాబ్​ బచ్చన్​. బిగ్​ బీ రేఖను రెండో పెళ్లి చేసుకున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. కానీ జయా బచ్చన్ జోక్యంతో వీరి మధ్య ఉన్న రిలేషన్ ముగిసిందని అంటుంటారు. బిగ్​ బీ కన్నా ముందు జితేంద్రతో రేఖకు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించేవి. కానీ అప్పటికే జితేంద్రకు పెళ్లి అవ్వడం వల్ల వీరిద్దరి రిలేషన్ ఎక్కువ రోజులు కొనసాగలేదట. అనంతరం హీరోగా విలన్​గా రాణించిన కిరణ్ కుమార్​తోనూ ఈమెకు ఎఫైర్ ఉన్నట్లు అనేవారు.

Bollywood star heroine Rekha fall in love with six heroes News Goes Viral

వీరే కాదు మరో బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్రతో కూడా రేఖకు సంబంధం ఉందని, వీరిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని అపట్లో పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్​ను రేఖ వినోద్ ఇద్దరు కొట్టిపారేశారు. ఈ పుకార్లన్ని ముగిసిపోయాకే ఆమె చివరికి బిజినెస్ మెన్​ ముఖేష్ అగర్వాల్​ను పెళ్లాడింది. కానీ ఆయన కొంత కాలంలోనే సూసైడ్​ చేసుకుని కన్నుమూశారు.

ఇక ముఖేశ్ మరణం తర్వాత రేఖ.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్​తోనూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపైనా రేఖ,సంజయ్ దత్ ఇద్దరూ స్పందించి ఖండించారు. ఇలా మొత్తంగా రేఖ సినీ కెరీర్​లో ఎన్నో రూమర్స్​ను ఫేస్ చేసింది. మరి ఇందులో నిజమెంతో అబద్ధం ఎంతో రేఖకే తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X