పెళ్లిలో డ్యాన్స్ చేయడానికి హృతిక్ రోషన్ రేటు ఎంతంటే.. క్రేజ్ మామూలుగా లేదు!

స్టార్ హీరోలు, హీరోయిన్లు, సోషల్ మీడియా స్టార్స్ కూడా ఈ మధ్య ఈవెంట్లకు హాజరవుతూ డబ్బులు బాగానే సంపాదించుకుంటున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు, షాప్, ఓపెనింగ్స్, మరిన్ని ఇతర ఫంక్షన్లకు స్టార్ లను పిలవడం ట్రెండ్ గా మారింది. కోటీశ్వరుల ఇళ్లల్లో పెళ్లికి తమ తాహతుకు తగ్గట్లుగా స్టార్ హీరోలను పిలుచుకుంటారు. అక్కడ డ్యాన్స్ చేసినందుకు డబ్బులు కూడా చెల్లిస్తుంటారు. అయితే ఒక స్టార్ హీరో కేవలం 5 నిమిషాల డ్యాన్స్ కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పెళ్లిలో డ్యాన్స్.. వీడియో వైరల్

బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ ల నుంచి హృతిక్ రోషన్ వంటి ప్రముఖులు.. పలువురు పెళ్లిళ్లకు హాజరవడం, అందుకోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవడం చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారమే. క్లయింట్ ఇష్టా ఇష్టాలకు తగ్గట్లుగా పాటలు పాడడమో, డ్యాన్సులు చేయడమో, డైలాగ్స్ చెప్పడమో చేస్తుంటారు.ఇటీవలే హృతిక్ రోషన్ ఓ పెళ్లిలో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ వీడియోను కనిపించింది. టీవీ ఛానెళ్లు, పేపర్లు, వెబ్ సైట్లన్నింటిలోనూ ఇదే వార్త నిలిచింది. అయితే ఈ వీడియోలో హృతిక్ రోషన్ వార్ సినిమాలో ఘంగ్రూ, బ్యాంగ్ బ్యాంగ్ టైటిల్ సాంగ్ పాడాడు.

Bollywood star Hrithik Roshans Jaw-Dropping Wedding Dance Worth Rs 2.5 Cr

భారీ మొత్తంలో వసూలు

అయితే ఈ పెళ్లికి వచ్చినందుకు గాను హృతిక్ రోషన్ భారీ మొత్తంలో వసూలు చేసినట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ పెళ్లికి హోస్ట్ గా వ్యవహరించినందుకు హృతి ఎంత మేర రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే విషయంలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. హృతిక్ కేవలం కమర్షియల్ యాడ్స్ మాత్రమే చేస్తాడని ఇలాంటి వేడుకల్లో డ్యాన్స్ చెయడని గతంలోనే కొన్ని కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అతను కూడా ఖాళీగా ఉంటే ఇలాంటి వేడుకల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

Bollywood star Hrithik Roshans Jaw-Dropping Wedding Dance Worth Rs 2.5 Cr

ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయలు

ఈ డ్యాన్స్ కోసం హృతిక్ రోషన్ ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయలు తీసుకున్నాడని టాక్ అయితే వస్తోంది. ఈ నటుడు వృత్తిపరంగా కంటే వ్యక్తిగతంగానే ఈ ఫంక్షన్ కు హాజరయ్యారనే టాక్ మరోవైపు వినిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. దాదాపు సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు హృతిక్ ఎంతయితే తీసుకుంటాడో ఇక్కడ కూడా అంతే తీసుకున్నాడు అనే టాక్ అయితే వస్తోంది.

Bollywood star Hrithik Roshans Jaw-Dropping Wedding Dance Worth Rs 2.5 Cr

సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ ఎంత?

హృతిక్ రోషన్ తన రాబోయే చిత్రం ఫైటర్‌లో తన పాత్ర కోసం 85 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఫైటర్ చిత్రం కోసం హృతిక్ రోషన్ 45 రోజుల డేట్స్ ఇచ్చాడట. దీన్ని బట్టి చూస్తే ఆయన రోజుకు ఎంత మొత్తంలో సంపాధిస్తున్నారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. రోజుకు అతను దాదాపు 2 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఏదైనా పార్టీలో హోస్టింగ్ కోసం వెళ్తే రూ.2 నుంచి రూ.2.5 కోట్లు అడగడంలో ఎలాంటి తప్పూ లేదని చెప్పవచ్చు.

Bollywood star Hrithik Roshans Jaw-Dropping Wedding Dance Worth Rs 2.5 Cr

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X