twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ?

    |

    మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కానున్నారు. అసలైతే ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను పూర్తి చేసి రెండు ప్రాజెక్టులను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ తుది దశలోకి వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో రామ్ చరణ్ మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

    ఆచార్య అనంతరం మరో రెండేళ్ల వరకు మెగాస్టార్ చాలా బిజీగా గడపనున్నారు. లూసిఫర్ రీమేక్ తో పాటు బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం శక్తి దర్శకుడు మెహర్ రమేష్ తో కూడా కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన టాక్ ప్రకారం మెగాస్టార్ బాబీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఒక బాలీవుడ్ స్టార్ యాక్టర్ ముఖ్యమైన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

    Bollywood star in Megastar chiranjeevi upcoming movie

    ఆయన మరెవరో కాదు. నవాజుద్దీన్ సిద్దిఖీ. ఎలాంటి పాత్రలో అయినా ప్రాణం పెట్టి నటించగల నవాజుద్దీన్ మెగాస్టార్ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించినట్లు సమాచారం. ఆయన ఎక్కువగా సౌత్ సినిమాల్లో నటించింది లేదు. కథ పాత్ర నచ్చితేనే ఒప్పుకునే ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇక తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తే నటించాలని అనుకుంటున్నాడు. దర్శకుడు బాబీ త్వరలోనే ముంబైకు వెళ్లి నవాజుద్దీన్ కు కథ వినిపించనున్నట్లు సమాచారం.

    English summary
    Needless to say, what level of fans are waiting for megastar Chiranjeevi Acharya movie. His first full-length role with his son Ram Charan created a buzz in the film. The megastar plans to complete the shooting of the film as soon as possible.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X