RRRని మించిన మల్టీస్టారర్.. షారుక్, సల్మాన్ ప్లాన్స్ మాములుగా లేవుగా!
బాహుబలి అనంతరం ఎవరు ఊహించని విధంగా దర్శకధీరుడు రాజమౌళి ఎంచుకున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పై ఒక్కసారిగా అందరి దృష్టి మళ్లింది. అసలు మల్టీస్టారర్ అంటే ఇదేనని RRR ఎనౌన్స్మెంట్ రోజే నేషనల్ మీడియా ప్రపంచానికి వినిపించింది. ఇక ఈ మధ్య బాలీవుడ్ బడా హీరోల బాక్సాఫీస్ లెక్కలు తారుమరవ్వడంతో అంతకుమించిన మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. మెయిన్ గా షారుక్ ఒక అడుగు ముందుకు వేయబోతున్నాడు.

RRR మూవీ
RRR సినిమాలో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ స్టార్ హీరోలు నటిస్తుండడం అందరిని ఎట్రాక్ట్ చేసింది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఆ సినిమాకు మించిన మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు షారుక్ సల్మాన్ ఖాన్ తో చేతులు కలపబోతున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నిఖిల్ ద్వివేది వీరితో మల్టీస్టారర్ సినిమాను భారీ స్థాయిలో నిర్మించేందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ ని కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.

షారుక్ ఖాన్ ప్లాన్స్
ముందుగా ఈ బాలీవుడ్ మల్టీస్టారర్ ప్లాన్ కి షారుక్ ఖాన్ బీజం వేసినట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే గత కొంత కాలంగా షారుక్కి సరైన విజయాలు లేవు. దీంతో సల్మాన్ క్రేజ్ కి మల్టీస్టారర్ మసాలాను యాడ్ చేసి హిట్టుకొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సల్మాన్ కూడా ఇదే తరహాలో ఆలోచించినట్లు టాక్. కొన్నేళ్ల క్రితం వీరు చేసిన మల్టీస్టారర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సల్మాన ఖాన్ కూడా సై
గత కొద్దికాలంగా సల్మాన్ ఖాన్ పరిస్థితి బాక్సాఫీస్ వద్ద బాగాలేదు. గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా బోల్తా కొట్టాయి. దాంతో ఈసారి మళ్లీ పుంజుకోవాలంటే ఏదో ప్రత్యేకతతో రావాలని ఇద్దరు హీరోలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బడా నిర్మాత వీరిద్దరిని కలుపేందుకు సిద్ధమయ్యారు. దీంతో సల్మాన్ కూడా మల్టీస్టారర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందని షారుక్ తో చేతులు కలుపుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎవరు డైరెక్టర్ చెస్తారన్నది ఇంకా డిసైడ్ కాలేదు.
Recommended Video

వర్కవుట్ ఏ మేరకు అవుతుందో..
చాలా కాలంగా షారుక్, సల్మాన్ ఖాన్ కలిసి నటించలేదు. అప్పుడెప్పుడో కరణ్ అర్జున్ లాంటి బ్లాక్‌బస్టర్ తప్పితే.. పూర్తి స్థాయిలో వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించేలేదు. ఆ మధ్యలో తమ సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించింనా అవి బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇలాంటి క్రమంలో ఇద్దరి అభిమానులను ఖుషీ చేసే ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











