జాన్వీ కపూర్ ఆస్తిని కొన్న స్టార్ హీరో ఎవరంటే?

పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వి కపూర్ ఆస్తిని ఓ స్టార్ హీరో కొనుక్కున్నాడు. ఆ స్టార్ హీరో ఎవరు? జాన్వి ఆస్తినే ఎందుకు కొనుగోలు చేశాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు జాన్వి కపూర్ కు చెందిన ఆస్తిని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్ఫూర్తితో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. షారూఖ్ ను ఆదర్శంగా తీసుకున్న నటీనటులు ఎంతో మంది ఉన్నప్పటికీ నిలదొక్కుకున్న వాళ్ళు మాత్రం అతి కొద్ది మందే.

Bollywood Star Raj kummar rao buys rs 44 cr home of jhanvi kapoor inspired by shah rukhkhan

అందులో రాజ్ కుమార్ రావు కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చూసినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈరోజు స్టార్ గా నిలబడ్డాడు. కొంతకాలం క్రితం రాజ్ కుమార్ రావు 44 కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే ఆ ఇల్లు మరెవరినో కాదు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కు చెందినది కావడం విశేషం. జాన్వీ కపూర్ 2020 డిసెంబర్ లో ముంబైలో 39 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసింది. అయితే రాజ్ కుమార్ రావు 2022లో 44 కోట్ల రూపాయలకు అదే ఇంటిని ఆమె నుంచి కొనుగోలు చేశారు.

అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే తాజాగా రాజ్ కుమార్ రావు స్వయంగా ఆ ఇంటిని ఎందుకు కొన్నాడు అనే విషయాన్ని అఫీషియల్ గా చెప్పుకొచ్చారు. అది కూడా షారుక్ ఖాన్ మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ ఇంటిని కొన్నట్టు రాజ్ కుమార్ రావు తెలిపారు.

ప్రస్తుతం రాజ్ కుమార్ రావు నటించిన శ్రీకాంత్ అనే మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇల్లు కొనుగోలు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ ఒక విషయం చెప్పారు.

ఇల్లు కొనేటప్పుడు స్థోమత కంటే ఎక్కువ ధర ఉన్న ఇల్లు కొనండి. దానికోసం మీరు మరింత కష్టపడతారు అని షారుక్ అన్నారు. ఆ మాట బాగా నచ్చింది. అయితే ముంబై నగరంలో ఇల్లు కట్టుకోవాలనే నా కలను నేను నా భార్య పత్రలేఖ నిజం చేసుకున్నాం అని రాజ్ కుమార్ రావు చెప్పుకొచ్చారు.

ఆయన నటించిన శ్రీకాంత్ మూవీ మే 10న థియేటర్లలోకి వస్తోంది. ఇక ప్రస్తుతం రాజ్ కుమార్ రావు ఈ మూవీతో పాటు మరో రెండు మూడు సినిమాలతో బాలీవుడ్లో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: jhanvi kapoor shah rukh khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X