Brahmastra: వైజాగ్ లో రణ్‌బీర్‌ గ్రాండ్ ఎంట్రీ.. భారీ మాలతో ఆహ్వానం.. పవన్ కళ్యాణ్ పై స్పెషల్ కామెంట్!

టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వారి స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక యువ హీరో రణ్‌బీర్‌ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర సినిమాను భారీ స్థాయిలోనే ప్రమోట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రాజమౌళి తో కలిసి నేడు వైజాగ్ కు వచ్చిన రణబీర్ కపూర్ కు తెలుగు ప్రజలు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక ఆయన ఫ్యాన్ మీట్ లో తెలుగు హీరోలపై అలాగే పవన్ కళ్యాణ్ పై స్పెషల్ గా స్పందించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

సౌత్ లో కూడా గ్రాండ్ రిలీజ్

సౌత్ లో కూడా గ్రాండ్ రిలీజ్

టాలెంటెడ్ బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక ఈ సారి చారిత్రాత్మకమైన అడ్వెంచర్ ఫిలిమ్ బ్రహ్మస్త్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

రాజమౌళి సమర్పణలో..

రాజమౌళి సమర్పణలో..

ఆలీయా భట్ హీరోయిన్ గా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో టాలీవుడ్ హీరో నాగార్జున అలాగే అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక బ్రహ్మస్త్ర ప్రమోషన్ లో కూడా రాజమౌళి చిత్రం యూనిట్ తో కలిసి వర్క్ చేస్తూ ఉండడం విశేషం.

వైజాగ్ లో ప్రమోషన్స్

వైజాగ్ లో ప్రమోషన్స్

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో మాత్రం రణ్‌బీర్‌ కపూర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఇంతకు ముందు ఏ హిందీ హీరో కూడా చేయని విధంగా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మొదటగా వైజాగ్ వెళ్లారు. అక్కడ ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా మాట్లాడటమే కాకుండా మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు.

భారీ మాలతో ఘన స్వాగతం

భారీ మాలతో ఘన స్వాగతం

అయితే ఎయిర్ పోర్ట్ నుంచి వైజాగ్ లోని మెలోడీ థియేటర్ ప్రాంతంలోకి చేరుకున్న తర్వాత రణ్‌బీర్‌ కపూర్ కు తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాజమౌళి కూడా అతనితోనే ఉన్నాడు. ఇక రణ్‌బీర్‌ కు భారీ మాలతో స్వాగతం పలకడం విశేషం. తెలుగు హీరోలకు ఎలాగైతే వెల్కన్ చెబుతారో అదే తరహాలో ఘన స్వాగతం పలికారు.

పవన్ కళ్యాణ్ స్వాగ్ ఇష్టం అంటూ..

పవన్ కళ్యాణ్ స్వాగ్ ఇష్టం అంటూ..

ఇక రణబీర్ కపూర్ కొందరు అడిగిన ప్రశ్నలకు కూడా చాలా స్వీట్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగులో తనకు చాలా మంది హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది అని మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టమని అలాగే పవన్ కళ్యాణ్ స్వాగ్ కూడా చాలా నచ్చుతుంది అని తెలియజేశాడు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ కూడా తన కు మంచి మిత్రులు అని తెలియజేశాడు. ఇక బ్రహ్మాస్త్ర సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో రణ్‌బీర్‌ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X