సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ నెట్ వర్త్, సాలరీ.. ఎన్ని 100ల కోట్లు వెనకేశాడో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇండియాలోనే ఆయన బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగారు. అయితే అగ్ర స్థాయి హీరోలకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కు జడ్ ప్లస్ కెటగిరీ సెక్యురిటీ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆ మధ్య సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు రావడంతో ఈస్థాయి సెక్యూరిటీ అందింది. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ దగ్గర స్పెషల్ గా బాడీ గార్డ్స్ కూడా ఉంటారు. అయితే వారిలో సల్మాన్ ఖాన్ బాగా నమ్మిన వ్యక్తి షేరా. సల్మాన్ ఖాన్ దగ్గర కొన్నాళ్లుగా బాడీగార్డ్ గా పనిచేస్తున్నారు.
సల్మాన్ బాడీగార్డ్ కాస్ల్టీ కార్..
బాయ్ జాన్ కు షేరా అంటే ఎంతో నమ్మకం ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు. ఇదే సమయంలో షేరా ఇటీవల ఓ ఖరీదైన కారును కొన్నారు. దీంతో ఆయన పేరు బాలీవుడ్ మీడియాలో కాస్తా గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆయన తీసుకున్న కారు మాములు కారు కాదు. ఏకంగా సెలబ్రెటీలకే షాక్ ఇచ్చే కోట్లు ఖరీదు చేసే కారు కావడం విశేషం. రేంజ్ రోవర్ రీసెంట్ మోడల్ ను 1.4 కోట్ల రూపాయలకు ఖరీదు చేసి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల వివరాలు కూడా ఆసక్తికరంగా మారాయి.

1995 నుంచి..
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ దగ్గర షేరా 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. సల్మాన్ ఖాన్ రక్షణ విషయంలో ప్రతి క్షణం అలర్ట్ గా ఉంటూ ఆయనకు బాగా దగ్గరయ్యారు. ఇక ఆయన భారీ సాలరీని అందుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నిఖర ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తుండటం విశేషం. అంత ఆసక్తి ఉన్నప్పటికీ బాయ్ జాన్ కు నమ్మకస్తుడిగా ఉండటమే ఆయనకు ఇష్టమంట. ఇక సల్మాన్ ఖాన్ కు ఎప్పుడు నీడలా ఉంటారాయన.
ఎవరీ షేరా?
ఇక షేరా అసలు గుర్మీత్ సింగ్ జాలీ. ఆయన 1969లో ముంబైలో జన్మించారు. 1990 తర్వాతసల్మాన్ ఖాన్ కు దగ్గరయ్యారు. 1995 నుంచి బాడీ గార్డ్ గా నియామకం అయ్యారు. అంతకు ముందు బాడీ బిల్డింగ్ పై ఫోకస్ పెట్టారు. చిన్న వయస్సులోనే ఆయన బాలీ బిల్డింగ్ కాన్సెర్ట్ లో అవార్డ్ లు పొందారు. ఇక సల్మాన్ ఖాన్ షూటింగ్ కు వెళ్లినా, ఎలాంటి ఈవెంట్స్ కు వెళ్లినా, షోస్, కోర్టు, ఇతర వ్యవహారాలపై బయటికి వస్తే సెక్యూరిటీ మొత్తం ఈయన కంట్రోల్ లోనే ఉంటుందని తెలుస్తోంది.
రాబోయే చిత్రాలతో బిజీ..
సల్మాన్ ఖాన్ ఆరు పదుల వయస్సుకు దగ్గరైన కూడా ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఇక తొలిసారిగా సల్మాన్ ఖాన్ మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. టాలీవుడ్ లో రామ్ చరణ్ కు అత్యంత సన్నిహితుడు. ఇక రీసెంట్ గా సికిందర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ 7 డాగ్స్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











