twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి వెనుకడుగు వేసిన సల్మాన్ ఖాన్.. జెట్ స్పీడ్ లోనే ప్రాజెక్ట్ క్యాన్సిల్!

    |

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎక్కువగా రీమేక్ సినిమాలతో బాక్సాఫీస్ భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. సల్మాన్ ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాడు. కథలు ఏమాత్రం కనెక్ట్ అయినా కూడా తనదైన శైలిలో రీమేక్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ అపజయాల్లో ఉన్న ప్రతి సారి కూడా ఏదో ఒక తెలుగు సినిమాతో మంచి బూస్ట్ అందుకుంటూ వస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు తమిళ్ సినిమాపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. కానీ అవి అంతగా కలిసి రావడం లేదు. అయితే చాలా కాలం తర్వాత ఈ బాలీవుడ్ కండల వీరుడు ఒక తమిళ సినిమాను ఎంతో ఇష్టంగా రీమేక్ చేయాలని ప్లాన్ చేశాడు. ఆ సినిమా హిట్ అయిన కొద్దిరోజులకే రీమేక్ పై చర్చలు మొదలు పెట్టాడు.

    సన్నిహితుల సలహాలు కూడా తీసుకొని రీమేక్ చేయాలా వద్దా అని ఒకటికి పదిసార్లు ఆలోచించాడు. అయితే అందరూ కూడా కథను కాస్త నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చితే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవచ్చు అని చెప్పారట. అయితే ఫైనల్ గా సినిమా స్క్రిప్టును సిద్ధం చేస్తున్న క్రమంలోనే మళ్లీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సల్మాన్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఆ సినిమా కథ మరేదో కాదు. ఈ ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్ సినిమా. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆ తమిళ్ మూవీ తెలుగు లో కూడా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాగా నచ్చడంతో హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మళ్ళీ తెరపైకి తేవాలని అనుకున్నట్టు.

    Bollywood star Salman khan cancelled Master remake plans,

    తనకు తెలిసిన టాప్ మోస్ట్ రచయితలను కూడా పిలిపించి సినిమా కథను మళ్ళీ కొత్తగా రాయాలని కూడా సలహా ఇచ్చాడట. ఇందుకోసం సల్మాన్ ఖాన్ అగ్ర దర్శకులను కూడా రంగంలోకి దింపాలని అనుకున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ ఇటీవల సల్మాన్ ఖాన్ టైగర్ 3 కోసం సిద్ధమవుతూ మాస్టర్ రీమేక్ పై షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. సినిమా రీమేక్.పనులను ఒక్కసారిగా అయించేసినట్లు తెలుస్తోంది. ఎందుకో ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేయాలని అనిపించడం లేదని ఓపెన్ గానే చెప్పేశాడట.

    రైటర్స్ కూడా సినిమా స్క్రిప్ట్ పనులను మధ్యలోనే వదిలి పెట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే సల్మాన్ కంటే ముందే హిందీలో మాస్టర్ సినిమాను రీమేక్ చేయాలని కొంతమంది హీరోలు బాగానే ప్రయత్నాలు చేశారు. కానీ ముందుగానే సల్మాన్ ఖాన్ ఇంట్రెస్ట్ చూపడంతో వారందరూ అప్పుడే తప్పుకున్నారు. ఇక ఇప్పుడు అసలు సల్మాన్ మొత్తమే చేయను అని చెప్పడంతో మరెవరైనా హీరోలు మాస్టర్ పై మళ్లీ ఫోకస్ పెడతారో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం టైగర్ సినిమాతో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ ఆ సినిమా స్పెషల్ షెడ్యూల్ కోసం రష్యాకు వెళ్ళాడు. సినిమాలు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తుండగా కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Bollywood star Salman khan cancelled Master remake plans,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X