Don't Miss!
- News
బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్ పంపిన యోగి ఆదిత్యనాథ్: మహిళపై దాడే కారణం
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
ప్రాణభయంతో సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం.. జేబులోనే గన్.. బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ సెక్యూరిటీతో కనిపిస్తున్నాడు. గతంలో అతని చుట్టూ ఎక్కువగా తన బాడీగార్డ్స్ మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతో అవసరం ఉంటే గాని సల్మాన్ ఖాన్ బాహ్య ప్రపంచంలో పెద్దగా కనిపించడం లేదు. ఇక రీసెంట్ గా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారం అయితే ప్రాణభయంతోనే ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెదిరింపు కాల్స్
ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీలను చంపేస్తామని అంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ అలాగే లేఖలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే సల్మాన్ ఖాన్ కు కొంతమంది గ్యాంగ్ స్టార్స్ నుంచి కూడా అపాయం ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలినట్లుగా టాక్ వచ్చింది. అంతే కాకుండా అతని కుటుంబ సభ్యులపై కూడా టార్గెట్ పెట్టినట్లు వార్తలు అయితే వస్తున్నాయి.

సల్మాన్ హై అలెర్ట్
ముంబై కి చెందిన ఒక ప్రముఖ గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తాను అని అలాగే అతని తండ్రిని కూడా ఫినిష్ చేస్తాను అంటూ ఒక లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సల్మాన్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు తన కుటుంబ సభ్యుల క్షేమం కోసం సల్మాన్ ఖాన్ స్పెషల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

లైసెన్స్ గన్
అయితే సల్మాన్ ఖాన్ ఇటీవల ప్రత్యేకంగా ఒక లైసెన్స్ గన్ కోసం ముంబై పోలీసులను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సల్కర్‌ను కలుసుకోగా లైసెన్స్ గన్ మంజూరు చేసినట్లు సమాచారం. ఆత్మరక్షణ లో భాగంగా ఇక సల్మాన్ ఖాన్ కొన్ని అనుమానిత ప్రదేశంలో వెళ్లినప్పుడు మాత్రం తప్పనిసరిగా తన జేబులోనే గన్ పెట్టుకొని ఉంటాడట.

చట్టపరమైన ఇబ్బందులు
గతంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే అదే విషయంలో సల్మాన్ ఖాన్ విభేదిస్తున్నాను అంటూ లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తాను అంటూ అలాగే అతని తండ్రిని కూడా ఫినిష్ చేస్తామంటూ లేఖలు విడుదల చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ అప్రమతమయ్యాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ లాయర్లు మా బెదిరింపుల విషయంలో కేసు కూడా వేయడం జరిగింది.

బుల్లెట్ ప్రూఫ్ కార్
అయితే సల్మాన్ ఖాన్ తన రక్షణలో భాగంగా ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే తన దగ్గర ఉన్న రెండు మూడు ఖరీదైన కార్లను కూడా బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీతో అప్డేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పాయింట్ బ్లాక్ లో ఎంత బలమైన బులెట్ వచ్చినా కూడా కారు డ్యామేజ్ అవ్వదట. మొత్తంగా మూడు కార్ల కోసం కోట్లల్లో ఖర్చు చేసి సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని పటిష్టంగా చేస్తున్నట్లు సమాచారం.