అలాంటి చెడు అలవాటుతో కెమెరాకు చిక్కిన సల్మాన్ ఖాన్.. భాయ్ ఇలాంటోడు అనుకోలేదు?
సినిమా ఇండస్ట్రీలో సినీ తారలు వెండి ధరపై ఎంత మంచి మాటలు చెప్పిన కూడా పర్సనల్ లైఫ్ లో ఉండే అలవాట్లు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇక కండల వీరుడుగా తన గంటకు ప్రత్యేకమైన గుర్తింపున అందుకున్న సల్మాన్ ఖాన్ కు ఎలాంటి చెడు అలవాట్లు లేవు అని అందరూ అనుకుంటారు అయితే ప్రస్తుతం అతనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కొంత వరకు నిజం ఉన్నప్పటికీ..: సినీ, క్రీడా ప్రముఖులు సిగరెట్, మందు లాంటివి తాగడంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తారలు సిగరెట్ లాంటివి తాగుతూ ఫ్యాన్స్ కు కనిపించడం వల్ల వాళ్లు ఆ చెడు అలవాట్లు నేర్చుకుంటారని కొందరు విమర్శలు చేస్తుంటారు. ఇందులో కొంత వరకు నిజం ఉన్నప్పటికీ వాళ్లు వ్యక్తిగతంగా కూడా తమకు ఇష్టం వచ్చినట్లుగా ఉండొద్దా అంటూ మరో సెక్షన్ ప్రశ్నిస్తుంది.

టైగర్ 3 సెట్స్ నుండి ఓ వీడియో లీక్ : ఈ అంశంపై మరోసారి చర్చకు రావడం వెనక సల్మాన్ ఖాన్ ఉన్నాడు. అసలేం జరిగిందంటే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా టైగర్ 3 సెట్స్ నుండి ఓ వీడియో బయటకు రాగా అది కాస్తా వైరల్ గా మారింది. ఇప్పటివరకు భాయ్ కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని అనుకున్న ఫ్యాన్స్ ఆ వీడియో చూసి షాక్ అయ్యారు.
సల్మాన్ ఖాన్ సిగరెట్ తాగుతూ: అయితే అందులో కనిపిస్తున్న సల్మాన్ ఖాన్ సిగరెట్ తాగుతూ కినిపించారు. దీంతో ఇదంతా చర్చకు దారి తీసింద్. ఓ నెటిజెన్ ఈ వీడియోను షేర్ చేస్తూ బ్లాక్ డ్రెస్ లో ఉన్న సల్మాన్ ధూమపానం చేస్తుండడం మనం చూడొచ్చు అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆయనను చూసి యువతంతా చెడిపోయే ప్రమాదం ఉందని కొందరు, ఇలాగ పబ్లిక్ గా సిగరెట్ కాల్చాల్సిన అవసరం లేదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
గతంలోనే ఒకసారి..: గతేడాది రంజాన్ నెలలో ఇఫ్తార్ పార్టీకి హాజరైన షారుఖ్ ఖాన్ సిగరెట్ తాగుతూ కనిపించి వార్తా హెడ్ లైన్లలో నిలిచాడు. ఆ తర్వాత కొంత కాలానికే సల్మాన్ ఖాన్, అనన్య పాండే ధూమపానం చేస్తున్న వీడియో తెగ వైరల్ అయింది. నెటిజెన్లు ఈ వీడియోలను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. గతంలో లాగే ఇప్పుడు కూడా భాయ్ మరోసారి సిగరెట్ తాగుతూ వైరల్ అయ్యాడు.
సినిమాలతో బిజీగా..: సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 చిత్రంలో షారుష్ ఖాన్ కూడా కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు విశేష స్పందన లభించింది. అలాగే ఈ ఏడాది దీపావళికి ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. ఇక ఇటీవల సల్మాన్ నుంచి కిసీ కా భాయ్ కీసీ కి జాన్ అనే సినిమా వచ్చింది. అది బాక్సాఫీస్ వద్ద అంతగా వర్కౌట్ కాలేదు.


Click it and Unblock the Notifications











