Salman Khan ను హతమార్చేందుకు రెక్కి.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని ఉన్నట్లు కొంతకాలంగా పోలీసులకు విచారణలో అనేక రకాల విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఇప్పుడు మరొక విచారణ అనంతరం ముంబై పోలీసులు మరొక షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హతమార్చేందుకు ముందుగానే ప్లాన్ ప్రకారం రెక్కి కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇదివరకే సల్మాన్ ఖాన్ కు కొన్ని బెదిరింపులు లేఖలు వచ్చాయి. ఇక ఇప్పుడు రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలియడంతో విషయం దేశవ్యాప్తంగా మరింత హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ జాగ్రత్తలు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో తన రక్షణ కోసం సెక్యూరిటీని కూడా పెంచుకున్నాడు. ఎక్కడికి వెళ్లినా కూడా పోలీసులకు ముందుగా సమాచారం అందించనిదే బయటకు కాలు కూడా పెట్టడం లేదు. అంతేకాకుండా తన రక్షణ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా ఏర్పరచుకున్నట్లుగా తెలుస్తోంది. లైసెన్స్ తో కూడిన గన్ కూడా అతని వద్ద ఉన్నట్లు సమాచారం.

బెదిరింపులు
సల్మాన్ ఖాన్ గత కొన్ని నెలల క్రితం ఒక గ్యాంగ్ స్టార్ నుంచి బెదిరింపు కాల్స్ తో పాటు లేఖలు కూడా వచ్చినట్లు కథనాలు వచ్చాయి. అయితే వెంటనే ఆ విషయం సల్మాన్ ఖాన్ లాయర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఆ ప్రముఖ గ్యాంగ్ స్టార్ కు సంబంధించిన వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కూడా జరిపారు.

ముందుగానే రెక్కి
ఇదివరకే పంజాబ్ లో ప్రముఖ గాయకుడు సిద్దు మూసేవాలాను కొందరు కారులో వెళుతుండగా గన్ తో కాల్పులు జరిపి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే అదే తరహాలో సల్మాన్ ఖాన్ ను కూడా హతమార్చేందుకు కొందరు రెక్కీ కూడా నిర్వహించినట్లు ఇటీవల ముంబై పోలీసుల విచారణలో బయటపడింది. అయితే సల్మాన్ ఖాన్ కోసం రెక్కి నిర్వహించింది మరి ఎవరో కాదు సిద్ధూని మర్డర్ చేసిన వారే ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం కూడా రెక్కి నిర్వహించారని అని ముంబై డీజీపీ తెలియజేశారు.

ఇదివరకే గ్యాంగ్ స్టర్ ద్వారా
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంతకుముందు సల్మాన్ ఖాన్ తో పాటు అతని కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ తో పాటు అతని తండ్రిని కూడా టార్గెట్ చేశామని అతను సంచలనంగా వివరణ ఇవ్వడంతో పోలీసులు ఒక్కసారిగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులకు చెప్పనిదే బయటకు కూడా రావడం లేదు.

బిష్ణోయ్ సలహాతోనే రెక్కి
ఇక లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకే రెక్కి జరిగినట్లు తెలుస్తోంది. సిద్ధూని హతమార్చిన వారు ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం కూడా టార్గెట్ సెట్ చేయడానికి సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బిష్ణోయ్ సలహాల మేరకు ముందుగానే రెక్కీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు ముందుగా జాగ్రత్త పడి విచారణ జరపడంతో అసలు విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. మరి తరహా పరిస్థితుల అనంతరం సల్మాన్ ఖాన్ ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు చూడాలి.


Click it and Unblock the Notifications











