పొట్టకూటి కోసం వాచ్‌మెన్‌గా.. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన స్టార్

చిత్ర పరిశ్రమలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. సూపర్‌స్టార్లుగా విలాసవంతమైన జీవితం అనుభవించిన వారు దయనీయ స్థితిలో మరణించిన వారెందరో. రాజభోగాలు, దానధర్మాలు, అప్పులు ఇలా కారణాలు ఏమైనా సరే చివరి దశలో పేదరికంలో మగ్గిపోయి తినడానికి తిండి కూడా లేక వెళ్లిపోయారు. సావిత్రి, కాంతారావు, చిత్తూరు నాగయ్య, రాజనాల ఇలా మన టాలీవుడ్‌లోనే ఎంతోమంది తెరవేల్పులు ఎలా జీవితాన్ని సాగించారో అందరికీ తెలిసిందే.

దీపం ఉండగానే ఫార్ములాతో స్టార్స్
టాలీవుడ్‌లోనే కాదు.. దేశంలోని అన్ని భాషల్లో ఇలాంటి వారెందరో. తమ ముందు తరాల వారిలా తమ జీవితాలు కాకూడదనే ఉద్దేశంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు నేటి తరం స్టార్స్. కోట్లలో పారితోషికాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, పెట్టుబడులు, వ్యాపారాలు ఇలా డబ్బు ఏ మార్గంలో వచ్చినా వదిలిపెట్టడం లేదు. అయినప్పటికీ ఈ జనరేషన్‌లోనూ ఆర్ధిక ఇబ్బందులతో దయనీయంగా జీవితాన్ని గడుపుతున్న వారెందరో. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడు అత్యంత దయనీయ స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..

Bollywood Star Savi Sidhu Now Works As security guard Here s why

లాయర్ కాబోయి యాక్టర్‌గా
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన సావి సిద్ధూ.. న్యాయ శాస్త్రం చదువుకున్న ఉన్నత విద్యావంతుడు. అయితే సినిమాలపై ఆసక్తితో ముంబై ట్రైన్ ఎక్కేశారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. చిన్నదైనా, పెద్దదైనా ఏ ఛాన్స్ దొరికినా చేసుకుంటూ వచ్చేశాడు. నటుడిగా గుర్తింపు వచ్చిన తర్వాత పెద్ద సినిమాలలో సిద్ధూకి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో విష్ణువర్ధన్ 2013లో తెరకెక్కించిన ఆరంభం మూవీలో టెర్రరిస్ట్‌గా తన నటనతో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్‌లో గులాల్, బ్లాక్‌ఫ్రైడే, పాటియాలా హౌస్ వంటి చిత్రాల్లో నటించారు.

అవకాశాలు లేక వాచ్‌మెన్‌గా
హిందీ సినిమాల పైనే ఫోకస్ పెట్టిన సావి సిద్ధూ.. గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియా ఆరా తీయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ముంబై మహానగరంలోని పరేల్‌లో ఓ భవనంలో సెక్యూరిటీ గార్డ్ డ్రెస్‌లో బాగా చిక్కిపోయి, మాసిన గడ్డంతో ఓ వ్యక్తి కనిపించాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు సావి సిద్ధూ. స్టార్లతో పోటీపడి నటించిన ఈ నటుడు ఇప్పుడు పొట్టకూటి కోసం వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.

సాయం కోసం ఎదురుచూపులు
సిద్ధూని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చేసిన సినిమాలేవీ తన కెరీర్‌కు ఉపయోగపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో అవకాశాలు రాక.. కుటుంబం నుంచి కూడా దూరమైపోయానని, రోజుకు 12 గంటల పాటు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు సిద్ధూ తెలిపారు. రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, చివరికి థియేటర్‌కి వెళ్లి ఎంతో ఇష్టమైన సినిమాను చూడలేని దుస్థితిలో ఉన్నట్లు సిద్ధూ కన్నీటి పర్యంతమయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు కానీ మానవత్వం ఉన్న ఎవరైనా ఆదుకుంటారన్న ఆశతో ఎదురుచూస్తున్నట్లు సిద్దూ పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్ధూ వాచ్‌మెన్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు వీడియోలు, వైరల్ అవుతుండగా ఎవరైనా సెలబ్రెటీలు స్పందించి ఆయనను ఆదుకుంటారేమో చూడాలి. సిద్ధూ ఉదంతం చిత్ర పరిశ్రమలోని పరిస్ధితులను తెలియజేస్తోంది.

More from Filmibeat

Read more about: bollywood news Savi Sidhu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X