Aryan khan rave party: కొడుకును కాపాడే ప్రయత్నంలో షారుఖ్ ఖాన్.. షూటింగ్ పనులన్నీ క్యాన్సిల్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ రేవ్ పార్టీ వ్యవహారం మరింత సీరియస్ గా మారింది. ఒక్కసారిగా నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో అందరూ షాక్ అయ్యారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రస్తుతం కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌లో ముంబై డ్రగ్ బస్ట్ కేసులో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ప్రశ్నిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయం షారుఖ్ ఖాన్ కు చాలా ఆలస్యంగా తెలిసింది. ఇక ఇటీవల పఠాన్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్న షారుఖ్ వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని కొడుకు దగ్గరకు రావడానికి సిద్ధమయ్యారు.

అర్ధరాత్రి ఆకస్మిక సోదాలు

అర్ధరాత్రి ఆకస్మిక సోదాలు

ముంబై తీరంలో అర్ధరాత్రి ఇంటిలిజెన్స్ నుంచి సమాచారం అందుకున్న క్షణాల్లోనే ఒక క్రూయిజ్ షిప్‌పై అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు చేసిన తర్వాత శనివారం రాత్రి ఎన్‌సిబి ద్వారా రేవ్ పార్టీని ఛేదించిన ఆర్యన్‌ను విచారించడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు, ముంబైలోని బాండ్‌స్టాండ్‌లోని SRK యొక్క ఐకానిక్ బంగ్లా నుంచి షారూఖ్ ఖాన్ లేదా అతని సన్నిహితులు నుంచి ఈ విషయంలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు

షూటింగ్ క్యాన్సిల్

షూటింగ్ క్యాన్సిల్

అయితే పఠాన్ సాంగ్ షూటింగ్ లో భాగంగా ఇటీవల దీపికా పదుకొనేతో స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ ప్రస్తుతానికి షూటింగ్ వాయిదా వేయవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఇంటి వద్ద కూడా మీడియా వేచి చూస్తోంది. ఇక పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ప్రైవేట్ లైఫ్ తో బిజీగా

ప్రైవేట్ లైఫ్ తో బిజీగా

క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సిబి దాడిలో ఆర్యన్ ఖాన్ ఉన్నట్లు తెలియడంతో చాలా మంది బాలీవుడ్ తారలకు ఈ న్యూస్ షాక్ ఇచ్చింది. ఆర్యన్ ఎల్లప్పుడూ చాలా ప్రైవేట్ లైఫ్ తో బిజీగా ఉండడానికి ఇష్టపడతాడు. అయితే బయట పార్టీలకు హాజరు కావడంలో చాలా అరుదుగా ఉంటాడు. స్టార్ హీరో తనయుడు అయినప్పటికీ కూడా చాలా లో ప్రొఫైల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు.

NCB అధికారులతో షారుఖ్..?

NCB అధికారులతో షారుఖ్..?

ఇక పరిస్థితి గురించి తెలుసుకునేందుకు నిమిషానికి నిమిషం అప్‌డేట్ చేయడానికి షారుఖ్ NCB అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్యన్ ను అసలు ఏ నెపంతో అతడిని అదుపులోకి తీసుకున్నారనే దానిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. ఇక మరోవైపు షారుక్ తన రాబోయే చిత్రం పఠాన్ కోసం దీపికా పదుకొనేతో ఒక ప్రత్యేక పాట చిత్రీకరణ కోసం రాబోయే రోజుల్లో స్పెయిన్ వెళ్లనున్నాడు. కానీ ఇంతలోనే ఆర్యన్ ఖాన్ కేసు కొనసాగితే ఆ షూట్ కూడా వాయిదా వేయబడుతుంది.

గౌరీ ఖాన్ అప్సెట్

గౌరీ ఖాన్ అప్సెట్

ప్రస్తుతం షారూఖ్ బయటకు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సిబి అధికారులు స్టేట్‌మెంట్‌లో తమ పక్షాన్ని అందించిన తర్వాత చట్టపరమైన ఇన్వెస్టిగేషన్ లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. గౌరీ ఖాన్ అర్యన్ ఈ వార్తలపై ఒక్కసారి అప్‌సెట్ అయినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాజెక్ట్ కోసం రాబోయే రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ స్పష్టమైన కారణాల వల్ల అది ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.

Recommended Video

Kangana Ranaut True Admirer Of Jayalalitha | Thalaivii Interview
ఇండస్ట్రీలో ఆర్యన్ స్నేహితులు..

ఇండస్ట్రీలో ఆర్యన్ స్నేహితులు..

మహీప్ కపూర్ కూతురు షానయా అలాగే చంకీ పాండే కుమారుడు అహాన్ వంటి వారితో మాత్రమే ఆర్యన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వారితోనే అతనికి ఎక్కువగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. కాలేజ్ లో కూడా కొద్దిమందితో మాత్రమే ఆర్యన్ స్నేహితులు ఉన్నారట. అతని స్నేహితులు చాలా మంది యుఎస్ అలాగే యుకె నుండి వచ్చారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X