Shah Rukh Khan: ఆ వాచ్ ధర తెలిస్తే షారుక్ రేంజ్ ఏంటో అర్ధమవుతుంది.. బాబోయ్ మామూలు రిచ్ కాదు!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడి స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్న వారిలో షారుక్ ఖాన్ ఒకరు. ఇప్పుడున్న స్టార్ హీరోలలో అందరూ కూడా ఏదో ఒక విధంగా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారే. కానీ షారుక్ మాత్రం ఒంటరిగా టెలివిజన్ ప్రపంచం నుంచి వెండితెరపైకి వచ్చాడు. ఇక ఇప్పుడు అతను ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులైన సినీ తారలలో ఒకరు.

ఇక షారుక్ ఖాన్ ధరించే డ్రెస్ నుంచి వాచ్ ల వరకు అన్నీ కూడా మీడియాలో హాట్ టాపిక్ గా పడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఆయన ధరించిన ఒక వాచ్ గురించి ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి. దాని ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే..

షారుక్ ఖాన్ హై రేంజ్..

షారుక్ ఖాన్ హై రేంజ్..

బాలీవుడ్ బాద్షాగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న షారుక్ ఖాన్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా అతని హెయిర్ స్టైల్ నుంచి కాలి షూస్ వరకు కూడా ధర ఎంత ఉంటుంది అనే విషయంలో చాలామంది చర్చించుకుంటూ ఉంటారు. ఆ విధంగా షారుక్ ఖాన్ తన రేంజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు.

కసితో హీరో అయ్యాడు

కసితో హీరో అయ్యాడు

ఒకప్పుడు షారుక్ ఖాన్ కూడా పది రూపాయల కోసం కష్టపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్నో బాలీవుడ్ స్టూడియోల చుట్టూ అతను చెప్పులు అరిగేలా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇక అతనిలోని కసి స్టార్ హీరో అయ్యేలా చేసింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అతను అత్యధిక పారితోషషికం అందుకుంటున్న హీరోలలో ఒకరు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ చూసిన షారుక్ ఖాన్ పలు బిజినెస్లలో కూడా మంచి లాభాలను అందుకున్నాడు.

మరోసారి వాచ్ తో వైరల్

మరోసారి వాచ్ తో వైరల్

ఇక షారుక్ ఖాన్ కు సంబంధించిన ప్రతి వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం అతను ధరించిన ఒక వాచ్ గురించి కూడా అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. గతంలోనే షారుక్ ఖాన్ వివిధ రకాల కాస్ట్లీ వాచ్ లను ధరించి మీడియాను ఆకర్షించాడు. ఇక ఇప్పుడు కూడా అతను ఒక బ్రాండెడ్ వాచ్ ను ధరించి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు.

ధర ఎంతంటే..

ధర ఎంతంటే..

షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ వివరాల్లోకి వెళితే.. అది బ్లూ సిరామిక్ ఏపీ పర్మనెంట్ క్యాలెండర్ వాచ్‌ అని కామెంట్స్ వస్తున్నాయి. ఇక దని ధర 600,000 డాలర్స్ అని అంటున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీ లో దాదాపు రూ. 4.9 కోట్లు ఉంటుందట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచెస్‌ లో ఇది ఒకటిగా పరిగణించబడుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వాచ్ తయారీలో గోల్డ్ ఎక్కువగా వాడడం వలన ఎక్కువ ధరని కలిగి ఉందట.

 రిచెస్ట్ బాలీవుడ్ హీరో

రిచెస్ట్ బాలీవుడ్ హీరో

ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన సినీ తారలలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా టాప్ ఫైవ్ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక షారుక్ ఖాన్ ఆస్తుల విలువ అయితే 770 మిలియన్ల డాలర్లకు పైగా ఉంటుంది అని తెలుస్తోంది.

ఇంకా అతనికి దుబాయ్ లో అమెరికాలో అలాగే వివిధ దేశాల్లో కూడా ఆస్తులు ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఈ హీరో నుంచి పటాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X