బాలీలో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు.. చీకటిలో అలాంటి డ్రెస్సులతో!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కింగ్ ఖాన్, ఎస్ఆర్‌కే, సూపర్‌స్టార్ అంటూ ఆయనను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. భారతీయ సినిమాకు ఐకాన్‌గా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సంపన్న నటుల్లో ఒకరిగా, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానిగా షారుఖ్ దేశంపై బలమైన ముద్ర వేస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలూ చేస్తూ దూసుకెళ్తున్నారు షారుఖ్.
తన కెరీర్ తొలినాళ్లలోనే గౌరీఖాన్‌తో ప్రేమలో పడ్డారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే గౌరీని చూసి ఇష్టపడ్డారట షారుఖ్. గౌరీకి కూడా ఆయనంటే ఇష్టం ఉండటంతో ఇద్దరి మనసులు కలిశాయి. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. రెండు మతాలకు చెందిన వీరిద్దరూ తొలుత రిజిస్ట్రేషన్ మ్యారేజ్, తర్వాత ముస్లిం సంప్రదాయం ప్రకారం , ఆ తర్వాత పంజాబీ ఆచార వ్యవహారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

షారుఖ్ ఖాన్ - గౌరీఖాన్‌లు తమ ఇంట్లో హిందూ - ముస్లిం సంప్రదాయాలను పాటిస్తారు. రెండు మతాలకు చెందిన పండుగలను జరుపుకుంటారు. భార్య అంటే షారుఖ్‌కు పంచ ప్రాణాలు. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరిగా వీరిద్దరూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. షారుఖ్ - గౌరీ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు ఆర్యన్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్. వీరిద్దరిని ఎంతో అపురూపంగా పెంచారు షారుఖ్ దంపతులు. కొద్దినెలల క్రితం ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌పై కేసు నమోదవ్వగా ఆ తర్వాత విడుదలయ్యాడు. ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు శ్రమిస్తున్నాడు షారుఖ్.
ఇక సుహానా విషయానికి వస్తే.. అందంలో తల్లిదండ్రులకు ఏమాత్రం తీసిపోని ఈ ముద్దుగుమ్మ పలువురితో ప్రేమాయణం నడుపుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఓ నైట్ క్లబ్‌లో వీరిద్దరూ మాట్లాడుకుంటూ కనిపించడం, లండన్‌లో జరిగిన పార్టీలో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ కథనాలకు బలం చేకూరినట్లు అయ్యింది. సుహానా ఖాన్ - అగస్త్యలు గతంలో ది ఆర్చీస్ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. నాటి నుంచి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే సుహానా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం షారుఖ్ హీరోగా నటిస్తున్న కింగ్‌లో కీలకపాత్ర పోషిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుహానా ఖాన్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు, ఇతర వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తీరిక దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. తాజాగా ఇండోనేషియాలోని బాలీలో ఆమె వెకేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సన్ సెట్లో చీకటి పరుచుకుంటుండగా ఎద అందాలను చూపెడుతూ ఫోటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











