దీపిక పదుకోన్‌తో శృంగార సన్నివేశాలు.. మా డాడీ ఛాన్ప్ వదులుకోవద్దన్నారు.. యువ హీరో సంచలన కామెంట్
కాలక్షేపం, వినోదం కోసం అందుబాటులోకి వచ్చిన సినిమాల్లో ఇప్పుడు ఆ వినోదమే మిస్ అవుతుందాన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ డ్రామాను ఆస్వాదించి, హాయిగా నవ్వుకుని మనశ్శాంతిగా బయటకు వచ్చే రోజులు పోయాయి. ఏదైనా వీకెండ్‌కో, పండక్కో, పబ్బానికో ఇంటిల్లిపాది సినిమాకెళ్లి చూడలేని పరిస్ధితులు నెలకొన్నాయి. రక్తపాతాలు, బూతులు, హాట్ హాట్ సాంగ్స్, బెడ్ రూమ్ సీన్స్‌తో సినిమాలను నింపేస్తున్నారు మేకర్స్ .
గతంలో ఈ జోనర్ చిత్రాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో దర్శక నిర్మాతలు కూడా ఆ టైప్ మూవీస్ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. లేనిపక్షంలో కనీసం ఒకటి రెండు బోల్డ్ సీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాంప్రదాయవాదులు, సామాజికవేత్తలు ఎంతగా మొత్తుకుంటున్నా ఈ ట్రెండ్ మారడం లేదు.

ఇక బోల్డ్ క్యారెక్టర్లు చేసిన వారికి అవకాశాలు క్యూకడుతుండటం, దేశవ్యాప్తంగా పాపులారిటీ వస్తుండటంతో హీరోయిన్లు సైతం బెడ్ రూమ్ సీన్స్‌కు ఓకే చెబుతున్నారు. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్‌తో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయిన తృప్తి దిమ్రి ఆ మూవీ దెబ్బతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ దెబ్బతో ఆమెకు సౌత్, నార్త్‌లో అవకాశాలు పోటెత్తుతున్నాయి. తృప్తి సక్సెస్ కావడంతో ఆమెను చూసి మిగిలిన హీరోయిన్లు సైతం రెచ్చిపోయేందుకు సిద్ధమవుతున్నారు. మడిగట్టుకుని కూర్చొన్నవాళ్లు సైతం మనసు మార్చుకోక తప్పడం లేదు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ తరహా సీన్లు చేయడానికి నటీనటులు ఇబ్బంది పడరా, ముందు వారి తల్లిదండ్రులు, భార్యాబిడ్డలకు ఏం చెబుతారు వంటి డౌట్లు ప్రేక్షకులకు కలుగుతాయి. చాలామంది హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించడానికి ఎంతో ఇబ్బందిపడినట్లు చెప్పారు. నిన్నగాక మొన్న అంజలి సైతం ఆ సీన్లలో నటించి ఎంతో ఏడ్చినట్లు చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేది ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ సీన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో దీపిక పదుకొణెతో కలిసి గెహ్రైయన్ అనే చిత్రంలో నటించగా.. వీరిద్దరి మధ్య తెరకెక్కిన ఇంటిమేట్ సీన్లు అప్పట్లో బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. దీనిపైనే తాజా ఇంటర్వ్యూలో సిద్ధాంత్ స్పందించారు.

దీపికతో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడానికి భయపడ్డానని , తనతో రొమాంటిక్‌గా నటించడం కొత్తగా అనిపించిందన్నారు. తన తండ్రి సైతం ఈ విషయంలో ఎంతో ప్రోత్సహించారని.. గుర్తుచేశారు. చాలామంది ఇలాంటి అవకాశాల కోసం చూస్తారని.. నువ్వు ఎంట్రా ఇంకా ఆలోచిస్తున్నావని తన తండ్రి మైండ్ వాష్ చేశారని సిద్ధాంత్ తెలిపారు.
మా నాన్న చెప్పిన తర్వాతే దీపికతో ఇంటిమేట్ సీన్లలో నటించానని..ఇందుకోసం చాలా వర్క్‌షాపులు నిర్వహించామని ఆయన గుర్తుచేసుకున్నారు. సిద్ధాంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నటుడు అన్నాక అంటేనే అన్ని సన్నివేశాల్లో నటించాలని.. ఇలా భయపడితే ఎలా బ్రదర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











