ఫోర్బ్స్ జాబితా: రూ. 446 కోట్ల సంపాదనతో... ఇండియా నుంచి ఒకే ఒక్క హీరో!
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సంపాదన పరంగా చరిత్ర సృష్టించాడు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన వరల్డ్ వైడ్ టాప్ 100 హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్ల లిస్టులో చోటు దక్కించుకున్నాడు. 65 మిలియన్ డాలర్ల(రూ. 446 కోట్లు) సంపాదనతో అక్షయ్ 33వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ యాక్టర్ అక్షయ్ కుమార్ కావడం విశేషం.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సారి అక్షయ్ కుమార్... రిహానా, జాకీ ష్రాఫ్, బ్రాడ్లీ కూపర్ లాంటి వరల్డ్ స్టార్లను సైతం సంపాదనలో వెనక్కి నెట్టేయడం గమనార్హం. ఇక పోతే సంపాదన పరంగా ఈ సారి ఫోర్బ్స్ లిస్టులో మరోసారి పాప్ స్టార్ టేలర్ షిప్ట్ 185 మిలియన్ డాలర్ల(రూ. 1269 కోట్లు)తో నెం.1 స్థానంలో ఉన్నారు.

టేలర్ షిప్ట్ తర్వాతి స్థానంలో... అమెరికన్ రియాల్టీ షో స్టార్, బ్యూటీ మొగల్ కైలీ జెన్నర్ 170 మిలియన్ డారర్ల సంపాదనతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో కైలీ జెన్నర్ అక్కమొగుడు, సింగర్ కెన్నీ వెస్ట్ నిలిచారు. టాప్ వంద మందితో కూడిన లిస్టులో 10 లిస్టులో సార్ స్టార్లు లియోనల్ మెస్సి, క్రిస్టియానో రోనాల్డో, నెయిమూర్ కూడా ఉన్నారు.
1. టేలర్ షిప్ట్ : $ 185 మిలియన్
2. కైలీ జెన్నర్ : $170 మిలియన్
3. కెన్నీ వెస్ట్: $150 మిలియన్
4. లియోనల్ మెస్సీ: $127 మిలియన్
5. ఎడ్ షీరన్: $110 మలియన్
6. క్రిస్టియానో రొనాల్డో: $109 మిలియన్
7. నెయ్ మూర్: $105 మిలియన్
8. ది ఈగిల్: $100 మిలియన్
9. డా. ఫిల్ మెగ్రా: $95 మిలియన్
10. కనెలో అల్వరెజ్: $94 మిలియన్
అక్షయ్ కుమార్ సినిమాల విషయానికొస్తే... త్వరలో అతడు మిషన్ మంగళ్, హైస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో పాటు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీ బాంబ్' అనే చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











