అనంత్ అంబానీ చేతికి 50 కోట్ల వాచ్.. బాలీవుడ్ హీరోలకు ఎన్ని కోట్ల విలువైన వాచ్ ఇచ్చారో తెలుసా?

ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా ఒక్క మన దేశంలో మాత్రమే పెళ్లిళ్లు అత్యంత ఘనంగా జరుగుతాయని అంటారు చాలా మంది. అదే విధంగా ఒక్క మన దేశంలోనే అత్యధికంగా పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తారని ఇది కూడా వరల్డ్ లోనే హైయెస్ట్ అమౌంట్ ఉంటుందని ఆ మధ్య టాక్ వచ్చింది. మరి ఈ రేంజ్ లో మన దేశంలో పెళ్లిళ్లు జరుగుతాయి. డబ్బులు లేకపోయినా పెళ్లి మాత్రం అప్పు చేసి అయినా గ్రాండ్ గా చెయ్యాలని పెద్దలు చూస్తుంటారు.

ఇక ఇలాంటి ఒక గొప్పింటి పెళ్లి అయితే అది ఓహో అనే లెవెల్లో ఉంటుంది. మరి అది ఇండియా లోనే అత్యంత ధనవంతుని ఇంట్లో పెళ్లి అయితే ఖచ్చితంగా దేశం అంతా మాట్లాడుకునేలానే జరుగుతుంది. సో ఇప్పుడు అలా ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న ఆ పెళ్లే అనిల్ అంబానీ తనయుడు అనంత్ అంబాని పెళ్లి. రాధికా మర్చెంట్ అనే ప్రముఖ బిజినెస్ మాగ్నెట్ తో అనంత్ ఎప్పుడు నుంచో ప్రేమలో ఉండగా ఫైనల్ గా తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవడంతో వారి పెళ్లి ఇప్పుడు చాలా గ్రాండ్ ముంబైలో జరుగుతుంది.

bollywood stars got crores valued watches for anant ambani wedding

కాగా ఈ పెళ్లికి దేశ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ లలో ప్రముఖ దిగ్గజ స్టార్స్ అంతా హాజరయ్యారు. కాగా వారిలో బాలీవుడ్ హీరోస్ కి అంబానీ మావ ఇచ్చిన గిఫ్ట్ లు వాటి ఖరీదులు తెలిస్తే షాకవ్వాల్సిందే అని చెప్పాలి. ముందుగా తన కొడుకు పెట్టుకున్న వాచ్ ఒక్కటే 54 కోట్లు పెట్టి రెడీ చేశారట. రిచర్డ్ మిల్లె ఆర్ ఎం 52-05 టర్బిల్లన్ అనే వాచ్ తాను పెట్టుకున్నాడట. కాగా ఇక బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ లకి అంబానీ 2 కోట్లు విలువైన వాచ్ లని బహుమతిగా ఇచ్చాడట.

ఇవి రాయల్ ఓక్ పెర్పెట్యువల్ క్యాలెండర్ సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ ని వారి కోసం స్పెషల్ గా రప్పించి బహుకరించారట. అంతే కాకుండా తన కొడుకు తరపున వచ్చిన చాలా మందికి అవే వాచ్ లని అందించినట్టుగా తెలుస్తుంది. దీనితో సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి. మొత్తానికి అయితే అంబానీ మావ ఇచ్చిన ఈ ఖరీదైన బహుమతుల కోసం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు.

అయితే దక్షిణాది నుంచి కూడా సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితర బిగ్ స్టార్స్ కూడా హాజరయ్యారు కానీ వారికి మాత్రం ఈ తరహా బహుమతులు ఏవి రానట్టే తెలుస్తుంది. మరి ఆ ఇద్దరు హీరోస్ కే ఎందుకు అంత స్పెషల్ గా అది కూడా అంత ఖరీదైన బహుమతులు ఇచ్చారో అనేది వారికే తెలియాలి అని నెటిజన్స్ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇక వీరితో పాటుగా దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులూ, క్రికెటర్స్ ఎం ఎస్ ధోని, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెట్ స్టార్స్ కూడా ఇక్కడ సందడి చేశారు. అలాగే బాలీవుడ్ నుంచి పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ పెళ్ళికి హాజరయ్యి సందడి చేశారు.

More from Filmibeat

Read more about: bollywood ranveer singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X