twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ బాట పట్టిన బాలీవుడ్ స్టార్స్.. సల్మాన్, అమీర్ ఖాన్ వస్తే మన హీరోలకు ఇబ్బందులు తప్పవు!

    |

    కరోనా వైరస్ దెబ్బకు ఎక్కడా కూడా ధైర్యంగా షూటింగ్స్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీలకు ఎప్పుడు లేని విధంగా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక మధ్యలో ఆగిపోయిన సినిమాలను ఎలాగైనా పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ కి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత ఊరట లభించడంతో ఎక్కువగా ఇండోర్ లోనే షూటింగ్స్ చేసుకోబోతున్నారు.

    అందరి టార్గెట్..

    అందరి టార్గెట్..

    ఇకపోతే ప్రస్తుతం అందరి టార్గెట్ హైదరాబాద్ పైనే పడినట్లుతెలుస్తోంది. స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని పక్క ఇండస్ట్రీల వాళ్ళు కూడా హైదరాబాద్ స్టూడియోలను టార్గెట్ చేశారట. వీలైనంత వరకు చాలా మంది రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. బాలీవుడ్ కి చెందిన స్టార్ ప్రొడ్యూసర్స్ ఇప్పటికే హైదరాబాద్ కి వారి మేనేజర్లను పంపారట.

    కాలు బయటపెట్టలేని పరిస్థితి..

    కాలు బయటపెట్టలేని పరిస్థితి..

    మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువవుతోంది. అఫీషియల్ గా అందిన లేకల ప్రకారమే అక్కడ 90వేల పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇంకా టెస్ట్ చేయని కేసుల సంఖ్య చాలానే ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మహానగరం ముంబైలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. అందుకే అక్కడి సినీ తారలు బయటకు వెళ్లడం లేదు.

    హైదరాబాద్ బాట పట్టనున్న స్టార్స్..

    హైదరాబాద్ బాట పట్టనున్న స్టార్స్..

    ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్స్ చేసుకోవడానికి అనుకువుగా ఉంటుందని బాలీవుడ్ తారలు హైదరాబాద్ కి రానున్నారట. అంతే కాకుండా ఇక్కడ కరోనా కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. అందుకే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు హైదరాబాద్ లో కొన్నాళ్లపాటు ఉండడానికి ప్లాన్స్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇక్కడే లగ్జరీ ఇళ్లను అద్దెకు తీసుకొని షూటింగ్స్ అయిపోయేవరకు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారట.

    Recommended Video

    Deepika Padukone Pays Huge Salary For Her Bodyguard
     మన హీరోలపై ఎఫెక్ట్..

    మన హీరోలపై ఎఫెక్ట్..

    ఇప్పటికే టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది రామోజీ ఫిల్మ్ లో షూటింగ్స్ చేసుకోవడానికి అందులో లొకేషన్స్ బుక్ చేసుకున్నారు. ఇక బాలీవుడ్ నుంచి కూడా బుకింగ్స్ ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో RFCకి డిమాండ్ భారీగా పెరిగింది. ఇక బాలీవుడ్ నుంచి హైదరాబాద్ కి వచ్చే సినీ తారలు చాలా వరకు విషయం బయటకు రాకుండా షూటింగ్స్ పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాళ్ళ రాకతో మన స్టార్ హీరోలు షూటింగ్స్ చేసుకోవడానికి లొకేషన్స్ దొరక్క కొంత ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

    English summary
    a lot of makers are looking towards RFC to shoot their films. Now, the latest news is that a number of Hindi producers have started booking the studio from the last few days. As cases in Mumbai have gone high, they want to come down to Hyderabad and shoot in Hyderabad,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X