షారుఖ్‌ ఖాన్‌‌కి చెంప దెబ్బ .. కింగ్‌ఖాన్ లైఫ్‌లో నేటికీ మచ్చగానే!

భారతీయ చిత్ర పరిశ్రమలో దశాబ్ధాలుగా రారాజులా వెలుగొందుతున్నారు కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్. దాదాపు మూడున్నర దశాబ్థాల కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా మారారు. బాలీవుడ్ బాద్‌షాగా, కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకుంటున్నారు షారుఖ్. 60కి చేరువ అవుతున్నా నేటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు తీస్తూ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించుకున్నారు షారుఖ్ ఖాన్.

ఒకప్పుడు ఛాన్స్‌ల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన కుర్రాడు నేడు భారతీయ చిత్ర పరిశ్రమలో సంపన్న నటుల్లో ఒకరిగా, అత్యధిక ఆదాయం ఆర్జించే హీరోలలో ఒకరిగా నిలిచారు షారుఖ్ ఖాన్. పార్క్‌లలో , బీచ్ రోడ్‌లో తలదాచుకున్న వ్యక్తి నేడు వందల కోట్ల విలువైన రాజప్రసాదం లాంటి ఇంటికి యజమాని. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాలతో ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారంటే అతిశయోక్తి కాదు. పాన్ ఇండియా సినిమాల ధాటికి బాలీవుడ్ తన వైభవం కోల్పోతున్న సమయంలో జవాన్, పఠాన్ వంటి చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమని నిలబెట్టారు షారుఖ్ ఖాన్.

bollywood super star Shah Rukh Khan Was Slapped By A Woman In Mubai Local Train

ఇక ఇటీవల ముంబైలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ని షారుఖ్ ఖాన్ అద్దెకు తీసుకోవడం చర్చనీయాంశమైంది. వందల కోట్ల విలువైన మన్నత్‌లో ఆయన నివసిస్తూ ఉండగా.. పాలి హిల్ ఏరియాలోని రెండు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్స్‌ని అద్దెకు తీసుకున్నారు షారుఖ్. వీటి ఏడాది అద్దె రూ.2.9 కోట్లు . ఈ డూప్లెక్స్ ఇళ్లు.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ, ఆయన సోదరి దీప్సికా దేశ్‌ముఖ్ వద్ద మూడేళ్ల పాటు అద్దెకు తీసుకున్నారు షారుఖ్ ఖాన్ . దీని వెనుక ఆయన ఆలోచన ఏంటనే దానిపై బాలీవుడ్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

ఇక సినిమాలు, షూటింగ్స్‌లలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ సమాజం కోసం ఎంతో కొంత సమయం కేటాయిస్తుంటారు కింగ్ ఖాన్. ప్రఖ్యాత విద్యాసంస్థలు, కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లి విద్యార్ధులకు జీవిత పాఠాలు బోధిస్తుంటారు. పిల్లలు సరైన దారిలో నడిస్తే సమాజం బాగుంటుందని షారుఖ్ ఖాన్ విశ్వసిస్తుంటారు. అందుకే ఎక్కడికి వెళ్లినా తాను సినీరంగంలో ఎలాంటి ఇబ్బందులు పడింది? ఎలా ఇక్కడి వరకు వచ్చింది అన్న విషయాలను తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌లో తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన చేదు అనుభవాన్ని షారుఖ్ పంచుకున్నారు.

ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో షారుఖ్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి తొలిసారి ముంబైకి వెళ్లానని అప్పటి వరకు ఎక్స్‌ప్రెస్‌గా ఉన్న రైలు కాస్తా ముంబై రాగానే లోకల్ ట్రైన్‌గా మారిపోయిందని తెలిపారు. విపరీతంగా జనం ఎక్కడంతో రైలు కిక్కిరిసిపోయిందని షారుఖ్ వెల్లడించారు. దీంతో ఆయన తన మిత్రులతో కలిసి తమ సీట్లను కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందట.

ఇంతలో ఓ మహిళ వచ్చి సీటు కావాలని అడిగిందని.. ఆడపిల్ల కాబట్టి కూర్చోవడానికి తాను అంగీకరించానని, కానీ ఆమె తనతో వచ్చిన వ్యక్తికి కూడా సీటు ఇవ్వాలని అడిగేసరికి తాను కుదరదు అన్నానని షారుఖ్ చెప్పారు. దీంతో ఆమె నాపై గట్టిగా అరిచి చెంపదెబ్బ కొట్టిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్లయినా ఆ ఘటన బాలీవుడ్ బాద్ షాను ఇంకా వెంటాడుతుండటం గమనార్హం.

More from Filmibeat

Read more about: shah rukh khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X