అన్నదాతకు అండగా బాలీవుడ్.. డిసెంబర్ 8న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇటీవల పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళలను నిర్వహిస్తున్న రైతులకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అండగా నిలిచింది.
డిసెంబర్ 8వ తేది మంగళవారం దేశవ్యాప్తంగా రైతులు పిలుపు ఇచ్చిన సమ్మెకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపారు. బాలీవుడ్‌కు చెందిన దిలిజిత్ దోసాంజ్, రితేష్ దేశ్‌ముఖ్, రిచా చద్దా, హన్స్ రాజ్ మెహతా, ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, అనుభవ్ సిన్హా తదితరులు తమ మద్దతు తెలిపారు.

బాలీవుడ్ నటుడు దిలిజిత్ ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా నిలిచి ఆందోళనలతో భాగమయ్యారు.
నీవు ఈ రోజు ఐదు వేళ్లతో భోజనం చేస్తున్నామంటే.. అందుకు రైతన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. జైకిషాన్ అంటూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు.
ఇదిలా ఉండగా, రైతుల అందోళనను, సమ్మెను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న వారిలో కంగన రనౌత్, వివేక్ అగ్నిహోత్రి తదితరలు ఉన్నారు


Click it and Unblock the Notifications











