విషాదం.. ప్రముఖ నటుడు, డైరెక్టర్ కన్నుమూత
బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత సక్సెస్ఫుల్ నటుడిగా ఆయన కీర్తి దక్కించుకున్నారు. దేశభక్తిని చాటుకునే సినిమాలతో మనోజ్ కుమార్ బాలీవుడ్లో ఎన్నో సంచలనాలు సృష్టించారు. అలాంటి వ్యక్తి మరణించడంతో బాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన బాలీవుడ్ కి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికన నివాళులర్పిస్తున్నారు.
ఇక సీనియర్ నటుడు మనోజ్ కుమార్ అసలు పేరు హరికృషన్ గిరి గోస్వామి. ఆయన స్క్రీన్ నేమ్ ను మనోజ్ కుమార్ గా మార్చుకున్నారు. 1937 జూలై 24న జన్మించిన ఆయన 2025 ఏప్రిల్ 4న ఉదయం తుది శ్వాస విడిచారు. వయస్సు పై పడడంతో 87వ ఏటా ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కొద్ది రోజులుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ధీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు.

పలు పరీక్షలు నిర్వహించినప్పటికీ వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. వయసు పైబడి శరీరం సహకరించక తుది శ్వాస విడిచారని కుటుంబీకులు తెలుపుతున్నారు. 1957 నుంచి 1999 వరకు బాలీవుడ్లో మనోజ్ కుమార్ యాక్టివ్ గా పని చేశారు. సహారా, చాంద్, హరియాలి ఔర్ రాస్తా, ఫూలన్ కి సెజ్ వంటి చిత్రాలు తో పాటు 60 కి పైగా సినిమాల్లో నటుడిగా అలరించారు. నార్త్ ఆడియన్స్ లో మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు. నటుడిగా మనోజ్ కుమార్ చివరిగా నటించిన చిత్రం మైదాన్ ఈ జంగ్ 1999 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక డైరెక్టర్ గా కూడాను ఈయన గుర్తుండిపోయే సినిమాలను తెరకెక్కించారు. ఉప్ కార్, పురబ్ ఔర్ పశ్చిమ్, షోర్, రోటి కప్డా ఔర్ మఖాన్, క్రాంతి, క్లర్క్, జైహింద్ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసి 90వ దశకంలో ప్రేక్షకులను అలరించారు. తక్కువ చిత్రాలనే డైరెక్ట్ చేసినప్పటికిని విశేష ఆదరణ పొందారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన ఉప్ కార్ చిత్రానికి గాను 1968 లో బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ విభాగంలో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విశేషంగా సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం 1992లో ఆయనకు పద్మశ్రీ అవార్డును కూడా అందించింది.
ఇక 2016లో ఆయనకు సినీ లోకం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. హిందీ చిత్రాల్లో ఆయన రాసిన డైలాగ్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. దాంతోను రాష్ట్రస్థాయిలోను ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఇంత గొప్ప ఘనత కలిగిన మనోజ్ కుమార్ తుది శ్వాస విడవడంతో బాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆయనకు నివాళి అర్పించారు. మనోజ్ కుమార్ నుంచి దేశభక్తిని, సినిమా పట్ల ప్రేమని నేర్చుకున్నానని అక్షయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. మరొకవైపు కరణ్ జోహార్ కూడా నివాళి అర్పించారు. బాలీవుడ్ డైరెక్టర్ లు, నటులు, ప్రముఖులు కూడా తమ నివాళి అర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











