Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రముఖ గేయ రచయిత మృతి.. విషాదంలో లతా మంగేష్కర్
ప్రముఖ గేయ రచయిత యోగేష్ గౌర్ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాుల. ఆనంద్, రజనీగంధ లాంటి అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలకు ఆయన పాటలు రాశారు. ఆయన మృతిపై ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కొద్దికాలం క్రితం యోగేష్ జీ ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని నాలా సపోరా ప్రాంతంలోని తన శిష్యుడి ఇంటిలో ఉండి వైద్య చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం మృతి చెందారు అని సన్నిహితులు తెలిపారు.

కవి యోగేష్ జీ 1943లో లక్నోలో జన్మించారు. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో 60వ దశాబ్దంలో ఆయన బొంబాయి నగరంలో కాలుపెట్టారు. 1962లో సఖీ రాబిన్ అనే చిత్రానికి పాటలు రాసే అవకాశం రావడం ద్వారా ఆయన బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. 2018లో చివరిసారిగా అగ్రేజీ మే కహ్తే హై అనే చిత్రానికి పాటలు రాశారు.
ఇక యోగేష్ జీ మృతికి లతా మంగేష్కర్ సంతాపం ప్రకటిస్తూ.. హృదయాన్ని తట్టి లేపేలా పాటలు రాసిన కవి యోగేష్ జీ స్వర్గస్తులయ్యారనే వార్త తెలిసింది. ఆయన మరణ వార్త నన్ను దు:ఖంలో ముంచెత్తింది. యోగేష్ జీ రాసిన పాటలు నేను పాడాను. యోగేష్ ప్రశాంతతతో, మధుర స్వభావం కలిగిన వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.