Pushpa 2 vs Chhava: బాలీవుడ్ లో పుష్ప 2 ఫీవర్ .. అల్లు అర్జున్ తో పోటీపడలేక తప్పుకున్న స్టార్ హీరో..
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు, టీజర్, గ్లిమ్స్ వంటి అప్డేట్ కు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే.. విడుదలకు నెల రోజుల ముందే రూ. 1,000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసి, ఇండియన్ హిస్టరీ రికార్డులు తిరగరాసింది. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీతో పోటీ పడలేక బాలీవుడ్ సైతం తప్పకుండా స్టార్స్ తప్పుకుంటున్నారు. అలా.. బాలీవుడ్ స్టార్ హీరో కూడా రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ మూవీ ఏంటి?
పుష్ప 1 మూవీకి సిక్వెల్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ 'పుష్ప2' కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా మోస్ట్ వాంటెడ్ మూవీగా మారింది. ఈ మూవీని డిసెంబర్ 5న ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో.. మొత్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతుంది పుష్ప 2. ఇందులో ఇండియాలో 6500 స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌ల్లో చాలా గ్రాండ్ విడుదల కానున్నది.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే. రూ. 1000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప2 దేశంలోనే అత్యధిక మొత్తంలో భారీ మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ కైవసం చేసుకున్న మూవీగా నిలిచింది. ఇలా పలు పలు రికార్డులను బ్రేక్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. బాక్సాఫీస్ లో పుష్పాగాడి రూల్ కూడా ఓ రేంజ్ లో ఉండేలా ఉంది. దీంతో బాలీవుడ్ మూవీ మేకర్స్ పుష్ప 2 మేనియా భయపెడుతున్నట్టు తెలుస్తోంది. పుష్ప ప్లానింగ్ చూసి.. తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 పై పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హైప్ నెలకొన్నడంతో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌషల్ తన సినిమాను వాయిదా వేసుకున్నట్టు టాక్.

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌషల్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ ఛావా. మరాఠా రాజు శంభాజీ జీవితం ఆధారంగామూవీని తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. ఈ మూవీలో రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ వేసుకున్నారు. కానీ, సడన్‌గా అల్లు అర్జున్ ' పుష్ప 2' ఇదే బరిలో దిగడంతో ఛావా మేకర్స్ సంసిద్దంలో పడినట్టు తెలుస్తోంది. అనసరంగా.. పుష్ప 2తో పోటీ పడి ఇబ్బంది పడేకన్న సైడ్ కు తప్పుకుందామని భావిస్తున్నట్టు మూవీ మేకర్స్ టాక్.


Click it and Unblock the Notifications











