ముక్కు మొహం తెలియని సౌత్ హీరోలకు 700 కోట్లా? నోరుపారేసుకొన్న బాలీవుడ్ రచయిత

ఇప్పుడు భారతీయ సినిమా దగ్గర తెలుగు సినిమాలు సహా సౌత్ సినిమాలు కూడా ఏ రేంజ్ లో రాణిస్తున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెయిన్ గా తెలుగు సినిమాల డామినేషన్ హిందీ మార్కెట్ లో భారీ స్థాయిలో కనిపిస్తుంది. దీనితో ఇండియా వైడ్ గా తెలుగు సినిమాలకి వసూళ్లతో మేజర్ గా హిందీ వెర్షన్ లోనే అత్యధికంగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి.

అయితే ఇది చాలా వరకు కొంతమంది స్వాగతించినప్పటకీ తమ ఇండస్ట్రీలో ఇతర భాషల సినిమాల డామినేషన్ అనేది కొంతమందికి మింగుడు పడడం లేదు. పైగా ఇపుడు బాలీవుడ్ సినిమాలు పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉండడంతో అక్కడ థియేటర్స్ నడవడానికి కూడా కష్టంగా మారింది. కాగా ఈ సమయంలోనే వచ్చిన పలు సినిమాలు హిందీలో అదరగొట్టాయి కానీ వాటి ధాటి బాలీవుడ్ ను నిలబెట్టడానికి సరిపోలేదు.

bollywood writer javed akthar shocking comments on south heroes

కాగా ఇంకో పక్క మన తెలుగు సినిమాలు అత్యధికంగా హిందీలో డబ్బింగ్ అయ్యి అక్కడ సినిమాల రికార్డులు సైతం తిరగరాయడం అనేది వారికి మరింత తలనొప్పిగా మారింది. కాగా దీనిపైనే బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సీనియర్ రచయిత జావేద్ అక్తర్ చేసిన కామెంట్స్ ఇపుడు ఒకింత షాకింగ్ గా మారాయి. సౌత్ సినిమాలని డీగ్రేడ్ చేస్తూ బాలీవుడ్ కి ఏమయ్యింది అంటూ విమర్శలు చేస్తున్నారు.

దక్షిణాది నుంచి ముక్కూ మొహం తెలియని హీరోల సినిమాలు హిందీ మార్కెట్ లోకి వచ్చి 600 కోట్లు 700 కోట్లు వసూళ్లు చేస్తున్నాయి అంటూ అసహనం వ్యక్తం చేయడం ఇపుడు చర్చకి దారి తీసింది. కాగా తాను లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో ఓ మీట్ లో ఇదంతా మాట్లాడ్డం జరిగింది. బాలీవుడ్ మార్కెట్ లో దక్షిణాది సినిమాల మార్కెట్ ఎక్కువ అయ్యింది అని మన సినిమాలకి ఏమయ్యింది?

బాలీవుడ్ ఒకప్పటిలా లేదు అంటూ తమ ఇండస్ట్రీ వెనుకబాటుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే తమ ఇండస్ట్రీ వెనక్కి వెళ్లడంతో ఇతర ఇండస్ట్రీలని తక్కువ చేసి మాట్లాడాలా అంటూ పలు విమర్శలు సోషల్ మీడియాలో తనపై వస్తున్నాయి. ఇక ఈ క్రమంలో అమీర్ ఖాన్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇపుడు ఓటిటిల ప్రభావం హిందీ సినిమాలపై చాలా ఉందని తాను వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు అంటే హిందీ సినిమాలు కానీ తన సినిమాలు కానీ చూడమని చెప్పేందుకు ఒక ఆస్కారం ఉండేది ఎందుకంటే అపుడు మొదటి ఛాయిస్ గా ఒక కొత్త సినిమాకి థియేటర్ ఒకటే ఉండేది కానీ ఇపుడు 8 వారాల వరకు ఆగితే సరిపోతుంది అని ఆడియెన్స్ కూడా ఆగిపోతున్నారు అంటూ జావేద్ మాటలకి పాక్షికంగా ఒకింత వ్యతిరేకంగానే మాట్లాడ్డం గమనార్హం. దీనితో వీరి షాకింగ్ స్టేట్మెంట్ లు ఇపుడు బాలీవుడ్ సహా దక్షిణాది సినిమా వర్గాల్లో కూడా వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్ కంబ్యాక్ కోసం తన అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: amir khan pushpa 2 chhaava
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X