బాలీవుడ్ స్టార్ హీరోలకు బాంబు బెదిరింపులు..అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలను టార్గెట్..ఏం జరిగిందంటే?
సినీ తారల ఇంటికి అలాగే పలు ప్రముఖ వ్యాపారవేత్తల ఇంటికి అప్పుడప్పుడు బాంబు బెదిరింపులు రావడం అనేది సహజంగా మారిపోతోంది. కొన్నిసార్లు ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మరోసారి ముంబైలో బాలీవుడ్ ప్రముఖ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లుగా ఫోన్ కాల్స్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వారి ఇంట్లో బాంబులు
బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబచ్చన్ అలాగే ధర్మేంద్ర ఇళ్లల్లో ఒకేసారి బాంబులు పెట్టినట్లుగా ఫోన్ కాల్స్ వచ్చాయి. వీరు గతంలో షోలే సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రోజు నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే అందులో అమితాబచ్చన్ అలాగే ధర్మేంద్ర ఇంట్లో కొన్ని భారీ పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా అగంతకులు తెలియజేశారు.

అలెర్ట్ అయినా అధికారులు
ఇక వెంటనే అలెర్ట్ అయినా పోలీసు అధికారులు అమితాబచ్చన్ ధర్మేంద్ర ఇంటికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది. గతంలో కూడా కొన్ని ఫేక్ కాల్స్ వచ్చినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా తనిఖీలు నిర్వహించారు. ఇక మంగళవారం రోజు కూడా పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్స్ తో వెళ్లి బాలీవుడ్ ప్రముఖుల ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు
ఇక దాదాపు రెండు మూడు గంటల వెతుకులాట తర్వాత ఇంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. గతంలో కూడా కొంతమంది బాలీవుడ్ హీరోల ఇంట్లో బాంబులు పెట్టినట్లుగా కాల్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ వంటి హీరోలకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.

అంబానీ ఇంటికి సైతం..
మంగళవారం అలాంటి కాల్స్ వచ్చిన తర్వాత పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ప్రత్యేకంగా అమితాబచ్చన్ ధర్మేంద్ర ఇంటి వద్ద సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అలాగే అదే రోజు ముంబై లోని ముఖేష్ అంబానీ ఇంటికి కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా పోలీసులు వివరణ ఇచ్చారు.

ఉగ్రవాదుల సమాచారం
ఇక ఆ ఫోన్ కాల్స్ లో కూడా ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం కూడా వచ్చినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ముంబైలోకి భారీ సంఖ్యలో మారణాయుధాలతో ఉగ్రవాదులు చొరబడ్డారు అని త్వరలోనే ఊహించని విధంగా కొన్ని పెను విద్వాంసాలకి ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేసినట్లుగా కథనాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు అయితే ముందు జాగ్రత్తగా ముంబై నలుమూలల సెక్యూరిటీని మరింతగా పటిష్టమైతే చేశారు.


Click it and Unblock the Notifications











