For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RajKundraకి హైకోర్టు షాక్.. శిల్పకు నా వీడియోలు ఇష్టమని ఇంకా ఇంకా, షెర్లిన్ సంచలనం!

  |

  జూలై 19న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేయగా, దాని ఐటి చీఫ్‌గా పని చేసిన ర్యాన్ థోర్పేని జూలై 20 న అరెస్టు చేశారు. ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే రాజ్ కుంద్రా అరెస్టుకు ముందు, నటి షెర్లిన్ చోప్రా ఏప్రిల్‌లో అతడిపై లైంగిక వేధింపుల సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వ్యాపార ఒప్పందానికి సంబంధించి రాజ్ కుంద్రాతో మాట్లాడినట్లు షెర్లిన్ ఆరోపించింది. అయితే ఫోన్ మెసేజ్ ద్వారా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీని తర్వాత రాజ్ కుంద్రా ఆమె ఇంటికి వచ్చి ఆమెను బలవంతంగా ముద్దాడాడని ఆరోపించింది. షెర్లిన్ రాజ్ కుంద్రాను ఆపడానికి ప్రయత్నించినా అతను ఆగలేదని ఆరోపించింది. కానీ ఆమె భయపడింది. ఇలా ఫిబ్రవరి నుంచి జరుగుతున్న విచారణ ఒక కొలిక్కి రావడంతో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ఇక అశ్లీల కేసులో జైల్లో ఉన్న రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టు నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే

  హైకోర్టు షాక్

  హైకోర్టు షాక్

  పోర్న్ ఫిల్మ్ కేసులో, వ్యాపారవేత్త మరియు నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మరియు ర్యాన్ థోర్పే పిటిషన్లను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. తమని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వారు ఇరువురూ కోర్టుకు ఎక్కారు. వాస్తవానికి, అసభ్యకరమైన సినిమాలు రూపొందించి యాప్ ద్వారా ప్రసారం చేసిన కేసులో తమని అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రాజ్ కుంద్రా మరియు ర్యాన్ థోర్పేల పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ పూర్తి చేసింది మరియు దానిపై తీర్పును మాత్రం ఈ రోజుకు రిజర్వ్ చేసింది. ఇక విచారణ సమయంలో, కుంద్రా కేసు దర్యాప్తులో సహకరించడం లేదని పోలీసులు హై కోర్టులో వాదించారు. పోలీసుల తరఫున చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ పాయ్, కుంద్రా ల్యాప్‌టాప్ నుండి అనేక వీడియో క్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారని, వారిని అరెస్టు చేయడానికి మరియు కస్టడీకి తీసుకోవడానికి కుంద్రా మరియు థోర్పేపై తగిన ఆధారాలు ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు.

  అదంతా ఒట్టిదే

  అదంతా ఒట్టిదే

  ఇక సిఆర్‌పిసి సెక్షన్ 41 ఎ కింద తనకు నోటీసు జారీ చేయడాన్ని పోలీసులు తప్పనిసరిగా పాటించలేదని రాజ్ కుంద్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టులో కుంద్రా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఆబాద్ పోండా, పోలీసుల ఆరోపణ ప్రకారం 41A నోటీసును అంగీకరించడానికి కుంద్రా నిరాకరించినప్పటికీ, అతడిని అరెస్టు చేయడానికి ముందు ప్రాసిక్యూషన్ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని వాదించారు. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారని వారు వాదించారు. కుంద్రాను అరెస్టు చేయడం మరియు అతని ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకోవడం జులై 19 న జరిగిందని, పోలీసులు తర్వాత సాక్ష్యాల విధ్వంసం చేర్చారని పోండా చెప్పారు. జూలై 23న ఎఫ్ఐఆర్‌లో ఈ ఆరోపణ జోడించబడిందని, అరెస్టుకు ముందు కుంద్రా సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు చూపించడానికి ఎలాంటి డాక్యుమెంట్ లేదా పంచనామా లేదని ఆయన అన్నారు.

  షెర్లిన్ సంచలనం

  షెర్లిన్ సంచలనం

  తమను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించాలని మరియు అరెస్టు చేసిన తర్వాత పోలీసు కస్టడీకి రిమాండ్ చేస్తున్న మెజిస్ట్రేట్ యొక్క రెండు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇద్దరూ హైకోర్టును కోరారు. కుంద్రాను జూలై 19 న అరెస్టు చేయగా, కుంద్రా కంపెనీలో ఐటీ చీఫ్‌గా పనిచేసిన థోర్పేని జూలై 20 న అరెస్టు చేశారు. ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 6 ఆగస్టు శనివారం నాడు రాజ్ కుంద్రా అశ్లీల చిత్ర కేసులో నటి షెర్లిన్ చోప్రాను పోలీసులు 8 గంటల పాటు విచారించారు. ఈ సమయంలో, షెర్లిన్‌కి రాజ్ కుంద్రాతో ఆమె సంబంధాలు ఎలా ఉన్నాయి అని అనేక ప్రశ్నలు అడిగారు. బయటకు వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయిన తర్వాత, శిల్పా శెట్టి పేరు బయటకు తెచ్చి రాజ్ కుంద్రా తనను ఎలా మోసం చేశాడో షెర్లిన్ వెల్లడించింది.

  నా వీడియోలు ఇష్టం అంటే

  నా వీడియోలు ఇష్టం అంటే

  శిల్పా తన వీడియోలను ఇష్టపడుతున్నారని రాజ్ తనకు చెబుతూనే ఉన్నాడని ఆమె వెల్లడించింది. ఇక మీడియాతో మాట్లాడిన షెర్లిన్ నా స్టేట్‌మెంట్‌ను ఎక్కడ మొదలుపెట్టాలో, ఎలా ముగించాలో నాకు అర్థం కావడం లేదని అన్నారు. నేను ఇంత పెద్ద వ్యవహారంలో చిక్కుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని వెల్లడించారు. నేను రాజ్‌ను కలిసినప్పుడు, నా జీవితం మారుతుందని నేను అనుకున్నానని షెర్లిన్ చెప్పింది. ఆయనతో కలిసి పనిచేయడం నాకు పెద్ద బ్రేక్ వస్తుందని పేర్కొన్నారు. శిల్పా శెట్టి భర్త నన్ను ఇలా తప్పుడు పనులు చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదని వెల్లడించారు. తాను చేస్తున్న పనిలో ఎలాంటి తప్పు లేదని రాజ్ తనకు ఎప్పుడూ చెప్పేవాడని షెర్లిన్ పేర్కొంది.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  అంత పెద్దోళ్ళు చెబితే

  అంత పెద్దోళ్ళు చెబితే

  'రాజ్ కంపెనీ ఆర్మ్‌స్ప్రైమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, నేను అతని కోసం వీడియోలు చేస్తూనే ఉన్నాను, క్రమంగా వీడియోలు గ్లామర్ నుంచి బోల్డ్‌ గా, బోల్డ్‌ నుంచి సెమి నూడ్‌ గా, సెమీ న్యూడ్‌ నుంచి న్యూడ్‌ గా మారాయని ఆమె వెల్లడించింది. షెర్లిన్ శిల్పా గురించి మాట్లాడుతూ తన వీడియోలను శిల్ప ఇష్ట పడుతుందని చెప్పి రాజ్ తనను ఇలా ఇరికించాడని షెర్లిన్ చెప్పింది. ఈ కారణంగా, నేను అలాంటి వీడియోలలో పనిచేయడానికి మరింత ప్రేరణ పొందానని వెల్లడించింది. ఇక మీరు శిల్పా శెట్టి వంటి వ్యక్తులచే ప్రేరేపించబడినప్పుడు, చేసేది మీరు చేసేది సరియైనదా లేదా తప్పా అని ఆలోచించరని, అలాంటి వీడియోలు చేసినందుకు నన్ను ప్రశంసిస్తున్నట్లు నేను విన్నప్పుడు, ఇంకా ఎక్కువ చేద్దాం అని అనుకున్నానని ఆమె వెల్లడించింది.

  English summary
  Raj Kundra was arrested after the trial, which has been going on since February. Raj Kundra, who is in jail in a pornography case, received a big shock from the Bombay High Court.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X