twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగన‌పై దేశ ద్రోహం కేసా? దేశ పౌరులను ఇలానే ట్రీట్ చేస్తారా? పోలీసులకు హైకోర్టు మొట్టికాయ

    |

    బాలీవుడ్ నటి కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్‌పై ముంబై పోలీసులు దాఖలు చేసిన దేశ ద్రోహం కేసుపై బాంబే హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. అయితే వారిపై తీవ్రమైన సెక్షన్లతో ఎఫ్ఐఆర్‌పై కోర్టు సీరియస్ అయింది. ముంబై పోలీసుల తీరును తప్పుపడుతూ జస్టిస్ షిండే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. జస్టిస్ షిండే చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

    కంగన రనౌత్ సోదరుడి పెళ్లి కారణంగా

    కంగన రనౌత్ సోదరుడి పెళ్లి కారణంగా

    ముంబై పోలీసుల విచారణకు హాజరుకాకపోవడంపై బాంబే కోర్టు సమన్లు జారీ చేసింది. వారిని అరెస్టు చేయాలంటూ సమన్లలో పేర్కొన్నది. అయితే కంగన తరఫు న్యాయవాది స్పందిస్తూ..తన క్లయింట్ తన సోదరుడి వివాహం కారణంగా బాంద్రా పోలీసుల విచారణకు హాజరుకాలేదు అని చెప్పారు. అయితే సమన్లను గౌరవించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

     దేశ ద్రోహం కేసుపై కోర్టు ఆగ్రహం

    దేశ ద్రోహం కేసుపై కోర్టు ఆగ్రహం

    అయితే తన క్లయింట్స్ శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరుకానున్నారని న్యాయవాది తెలియ జేయడంతో అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దేశ ద్రోహం కేసు పెట్టడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    దేశ పౌరులను ఇలానే ట్రీట్ చేస్తారా

    దేశ పౌరులను ఇలానే ట్రీట్ చేస్తారా

    దేశ పౌరులను ఇలానే ట్రీట్ చేస్తారా? వారిపై ఐపీసీ 124ఏ సెక్షన్ విధిస్తారా. ఈ కేసులో మిగితా సెక్షన్లను అర్ధం చేసుకోగలను. కానీ 124ఏ సెక్షన్ పెట్టడం ఏంటి? పోలీసులు ఇలాంటి సెక్షన్లు పెట్టడం సబబా? చాలా కేసుల్లో 124ఏ సెక్షన్ పెడతున్నారు. ఎలాంటి సెక్షన్లు పెట్టాలో అవగాహన కల్పించేందుకు అధికారులు ట్రైనింగ్ ఇవ్వండి అంటూ న్యాయమూర్తి ముంబై పోలీసులను నిలదీశారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే..

    ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే..

    ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే పౌరులపై దేశ ద్రోహం కేసు పెడుతారా? అంటూ బాంబే హైకోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. ఆ తర్వాత కంగన అరెస్ట్‌ను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తన క్లయింట్స్ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టలేదని కంగన తరఫు న్యాయవాది వెల్లడించారు.

    English summary
    Bombay High Court questions sedition case on Kangana Ranaut. Justice Shinde questioned Mumbai Police that Are you treating citizens of the country like this? 124A?. Why the police is invoking Section 124A IPC in such cases?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X