శ్రీదేవి డెత్ మిస్టరీ బయోపిక్‌పై వెనకడుగు వేసిన బోని కపూర్.. అందుకోసమేనా?
అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించి అగ్ర హీరోలందరితోనూ నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అలానే అన్ని భాషల్లోని సినీ ప్రియులను అలరించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఎంతో మందిని బాధపెట్టింది. ఇప్పటికే ఈమె డెత్ ఓ మిస్టరీయే అని చాలా మంది అంటుంటారు. ఈమె బయోపిక్ తీయాలని పలువురు ఆశిస్తుంటారు. అయితే తాజాగా దీనిపై శ్రీదేవి భర్త, నిర్మాత బోణీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.
అతిలోక సుందరి ఈ పదం వింటే ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి. అందానికి, నటనకు కేరాఫ్ అడ్రస్ ఆమె. ఎంతో మంది స్టార్ హీరోలతో ఆడిపాడింది. తమిళం, తెలుగు, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ టాప్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి వారి వారసులతో కూడా జోడిగా నటించి ఆకట్టుకుంది. హిందీలో జితేంద్ర, అమితాబ్, మిథున్ చక్రవర్తి వంటి స్టార్ హీరోలతో కలిసి చిందులేసింది. హిందీలో హిమ్మత్ వాలా, చాల్ బాజ్, సద్మా, మిస్టర్ ఇండియా, నగీన, చాందినీ, చాల్ బాజ్ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీదేవికి ఇంకా ఎంతో భవిష్యత్ ఉందనగానే ప్రమాదవశాత్తు కన్నమూసింది. ఆమె లేరన్న నిజాన్ని అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఆమె జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయోపిక్, పుస్తకాల ద్వారా తీసుకురావాలని చాలా మంది ప్రయత్నించారు. అయితే ఆ మధ్యలో శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో తెరకెక్కేందుకు సిద్ధమైంది.
రచయిత ధీరజ్ ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం శ్రీదేవి ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. మరి ఈ పుస్తకం వచ్చిందో లేదో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఆమె బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఆమె భర్త బోనీ కపూర్ రియాక్ట్ అయ్యారు. తాను బతికి ఉన్నంత వరకు అది కుదరదని గట్టిగా చెప్పేశారు.

శ్రీదేవి నటించిన ఇంగ్లిష్ వింగ్లిష్ మొదట ఐశ్వర్యారాయ్‌తో చేద్దాం అనుకున్నారు. కానీ ఐశ్వర్య ఒకప్పుడు మిస్ ఇండియా. ఆమె ఇంగ్లిషు రాని పాత్రలో నటిస్తే ఆడియెన్స్‌కు నచ్చదు. దానికి శ్రీదేవి అయితే కరెక్ట్ అని చెప్పాను. దర్శకనిర్మాతలు ఓకే అన్నారు. నేను చెప్పినట్టే శ్రీదేవి ఆ పాత్రలో జీవించేసింది. ఇంకా చెప్పాలంటే నా భార్య చాలా ప్రైవేట్ పర్సన్. తన పర్సనల్ విషయాలను బయటకు చెప్పాలని అనుకోదు. తన జీవించినంత కాలం అలానే ఉంది. ఇప్పుడు వాటిని బయటకు చెప్పడానికి నేను ఒప్పుకోను. నేను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు పర్మిషన్ ఇవ్వను అని బోనీ కపూర్ తెగేసి చెప్పేశారు.


Click it and Unblock the Notifications











