For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాన్వీ ఇంటికి వస్తున్న సీక్రెట్ లవర్.. ఆమె ఎఫైర్‌పై బోనీకపూర్ కీలక వ్యాఖ్యలు

|
Boney Kapoor Reacts On Janhvi Kapoor And Ishaan Khatter's Relation || Filmibeat Telugu

జాన్వీ కపూర్.. పేరుకు శ్రీదేవి కూతురే అయినా.. తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తల్లికున్న ఫాలోయింగ్‌తో నెగ్గుకు రావడం కష్టమని భావిస్తున్న ఈ బ్యూటీ.. స్వతహాగా ఎదగాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటోంది. అందం ఉన్నా నటనలో ఇంకా మెరుగు పడాలన్న కసితో పని చేస్తోంది. ఈ క్రమంలోనే డేటింగులు.. ఎఫైర్స్ అంటూ తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా వీటిపై ఆమె తండ్రి బోనీ కపూర్ స్పందించారు.

 మొదటి సినిమాతోనే మెప్పించింది

మొదటి సినిమాతోనే మెప్పించింది

జాన్వీ కపూర్ - ఇషాన్ ఖట్టర్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘ధడక్‌' మంచి విజయం సాధించింది. ప్యూర్ లవ్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో పాటు భారీ కలెక్షన్లనూ రాబట్టింది. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ క్రమంలోనే మరికొన్ని చిత్రాలకు సంతకాలు చేసింది.

 తరచూ వార్తల్లోకి..

తరచూ వార్తల్లోకి..

తల్లి బతికున్నప్పుడే తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది జాన్వీ కపూర్. ఆమె డ్రెస్సింగ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్, వీడియోలు ఇలా ప్రతి విషయం బీ టౌన్‌లో హైలైట్ అయ్యేది. దీంతో అమ్మడు సినిమాల్లోకి రాకముందే భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

పేరుకు శ్రీదేవి కూతురే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంతో జాహ్నవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె సినిమా విడుదలవక ముందే జాహ్నవి పేరిట ఎన్నో ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు, ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తున్నా.. సదరు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడకు వాలిపోతున్నారట. గతంలో తన ఫ్యాన్స్ వల్లే జాహ్నవి ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి.

ఇషాన్‌తో డేటింగ్ అంటూ వార్తలు

ఇషాన్‌తో డేటింగ్ అంటూ వార్తలు

‘ధడక్‌'లో తనతో పాటు నటించిన ఇషాన్‌తో జాన్వీ కపూర్ డేటింగ్‌లో ఉందని బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరూ తరచూ రహస్యంగా కలుస్తున్నారని అనుకుంటున్నారు. అంతేకాదు, ఈ మధ్య వీళ్లిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనేది ప్రస్తుతం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది.

 ఎఫైర్ వార్తలపై బోనీ కపూర్ స్పందన

ఎఫైర్ వార్తలపై బోనీ కపూర్ స్పందన

తన కూతురికి ఇషాన్‌తో ఎఫైర్ ఉందని వస్తున్న వార్తలపై బోనీ కపూర్ స్పందించారు. ‘‘జాన్వీ, ఇషాన్‌ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు అవాస్తవం. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. అందుకే వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేను గౌరవిస్తాను. ఇషాన్‌ మా ఇంటికి వస్తాడన్న వార్తల్లో నిజం లేదు. ‘ధడక్‌' విడుదలయ్యాక ఇషాన్‌.. ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు'' అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం చేస్తున్న సినిమా

జాహ్నవి కపూర్ ప్రస్తుతం ‘రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు ‘దోస్తానా 2'లో కూడా నటిస్తోంది.

English summary
Sridevi Daughter Janhvi Kapoor Big Fan Based Heroine. She Have number Of Fan pages IN Social Media. Her Fans send Letters To ‘Meet With you as early as possible’.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more