మాజీ సీఎం మనవడితో పెళ్లికి రెడీ అయిన జాన్వీ కపూర్.. స్వయంగా బోని కపూర్ అనౌన్స్!

ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రెటీలు అంతా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. ఆమె ఎవరో కాదు... అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఈ బ్యూటీ గత కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఆ వ్యక్తితో వివాహానికి సిధ్దం అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....

అందాల భామ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ ఆమెకు ఏవి కలిసి రాలేదు. దీంతో తల్లి లాగానే సౌత్ సినీ పరిశ్రమలో వెలిగిపోవాలని భావిస్తున్న ఆమె సౌత్ మీద ఫోకస్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం పట్టేసింది.

Boney Kapoor Confirms His Daughter Janhvi Kapoor Marriage Full Details Here

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం కూడా లభించింది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. మొన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఈ వేడుకలో జాన్వీ అచ్చం తన తల్లి శ్రీదేవిలా కనిపించింది.

ఇక రామ్ చరణ్ తండ్రి చిరంజీవి శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటింటారు. జాన్వీ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటించబోతున్నారు. వీరు జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా రీమేక్ చేస్తే బాగుండు అని ఓ సందర్భంలో చిరంజీవి కూడా చెప్పుకువచ్చారు. దానికి ఇంకా సమయం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న ఆమె పెళ్లి గురించి ఆమె తండ్రి బోనీ కపూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Boney Kapoor Confirms His Daughter Janhvi Kapoor Marriage Full Details Here

హీరోయిన్ జాన్వీ క‌పూర్ పెళ్లి పీఠ‌లు ఎక్క‌బోత‌న్న‌ట్టు బోనీ క‌పూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చారు. ఇక జాన్వీ ప్రియుడి పేరు శిఖ‌ర్ ప‌హారియా అని ఇప్పటికే తెలుసు. శిఖ‌ర్ తండ్రి సంజ‌య్ ప‌హారియా .. మ‌హారాష్ట్ర‌లో పెద్ద బిజినెస్ మ్యాన్ కాగా... తల్లి మాత్రం మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మాజీ హోం మంత్రిగా ప‌నిచేసిన సుశీల్ కుమార్ షిండే కుమార్తె. గ‌త కొన్నేళ్లుగా జాన్వీ క‌పూర్‌ శిఖ‌ర్ డేట్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కొన్ని సందర్భాల్లో జాన్వీ, శిఖ‌ర్ క‌లిసి ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి కాగా.. ఇప్పుడు ప్రేమలో ఉన్న వీళ్లిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు బోనీ క‌పూర్ అనౌన్స్ చేశారు. త్వ‌ర‌లో ఎంగేజ్మెంట్ స‌హా పెళ్లి డేట్‌ కూడా చేబుతామని చెప్పుకువచ్చారు. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. జాన్వీ కపూర్ ఎప్పుడు పెళ్లి కబురు చెబుతుందాలేదా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X