జాన్వీ కెరీర్ పై బెంగ పెట్టుకున్న బోనీ కపూర్

రోజు రోజుకీ ఓటీటీ ల జోరు ఊపందుకుంటుండంతో దర్శక -నిర్మాతలు కొత్త స్ట్రాటజీలను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లు కొత్త కంటెంట్ అన్వేషణలో తలమునకలయ్యాయి. నిరంతరం కొత్తదనం కోసం పాకులాడే జనాల కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నాయి.

అయితే, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కు రెండు సమస్యలు వచ్చిపడ్డాయి. సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరచుకునేక అవకాశం లేకపోవడంతో అటు తన పెట్టుబడులతో పాటూ, ఇటు కూతురు జాన్వీ కపూర్ కెరీర్ పైనా బెంగ పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఓటీటీ వల్ల జాన్వీ కెరీర్ కు నష్టం వాటిల్లే అవకాశాలపై ఆందోళన చెందుతున్నాడు.

Boney Kapoor doubts Janhvi Kapoor career

ప్రస్తుతం జాన్వీ కపూర్, గుంజన్ సక్సెనా అనే బయోపిక్ లో లీడ్ రోల్ చేస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణ సారధ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారానే విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. సినిమా నిర్మాత కరణ్ జోహార్ కు నెట్ ఫ్లిక్స్ తో మంచి అనుబంధం ఉండటంతో, ఇది కచ్చితంగా అదే ప్లాట్ ఫార్మ్ పై విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక జాన్వీ మరో సినిమా రూహీ అఫ్జా కూడా డిజిటల్ రిలీజ్ కే ముస్తాబు అవుతోంది.

కథాకథనం ప్రాధాన్యం గల ఈ రెండు చిత్రాలూ, ఎక్కువ మంది దృష్ఠిని ఆకర్షించడంలో విఫలమైతే, జాన్వీ కష్టం అంతా వృధాగా పోతుందని బోనీ వర్రీ అవుతున్నాడట. అదే జరిగితే, శ్రీదేవిని కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి జారిపోయిన ఫ్యామిలీ, మరింత డిప్రెస్ అవుతుందని అది భయం. ఏమైనా, జాన్వీ రెండో సినిమా కోసం నెటిజన్లు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి కూడా అమ్మాయి మెప్పిస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X