నా భార్య శ్రీదేవి కల నెరవేర్చాను.. బోని కపూర్ ఎమోషనల్ ట్వీట్
బాలీవుడ్ అగ్ర నిర్మాత బోని కపూర్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి నేర్కొండ పార్వాయిని విజయవంతంగా పూర్తి చేశారు. బాలీవుడ్‌లో భారీ సక్సెస్ అందుకొన్న పింక్ చిత్రాన్ని రీమేక్ చేసి విడుదలకు రెడీ చేశారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ అజిత్ కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా తారియాంగ్ తదితరులు నటించారు. ఈ చి్తరంలో విద్యాబాలన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి వినోద్ హెచ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 8 తేదీన రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీమియర్‌ను సింగపూర్‌లో ప్రదర్శించారు. దక్షిణాదిలో సినీ నిర్మాణం చేపట్టాలనే కోరిక శ్రీదేవికి ఉండేదనే విషయాన్ని చెప్పారు.
ఈ సందర్భంగా బోనీకపూర్ ట్విట్టర్‌లో స్పందించారు. సింగపూర్‌లో దిగ్విజయంగా నేర్కొండ పార్వాయి ప్రీమియర్ వేశాం. దీంతో నా భార్య శ్రీదేవి కపూర్ కలను పూర్తి చేయడానికి ప్రయత్నించాను. అజిత్ కుమార్, హెచ్ వినోద్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది కాదు. శ్రీదేవి కల నెరవేరేది కాదు. అందుకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అని బోనీకపూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల బోనికపూర్ మాట్లాడుతూ.. సినీ నిర్మాణ అంటే గొప్ప కళ. ప్రతీసారి కొత్తదనం ఉంటుంది. సినిమాలను నిర్మించడమంటే అదో ఛాలెంజ్ అని అన్నారు. తమిళంలోకి రీమేక్ సినిమా రూపొందించాలని నిర్ణయం తీసుకొనేందుకు చాలా జాగ్రత్తలు తీసుకొన్నాను. ప్రాంతీయ భాషకు కావాల్సిన అన్ని మార్పులు చేసి నేర్కొండ పార్వాయి రూపొందించారు.
నేర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ కుమార్ లాయర్ పాత్రలో నటించాడు. పింక్ సినిమాలో ఈ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు. కొన్నిమార్పులు చేసి యాక్షన్ సీన్లను క్రేజీగా చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











