‘మామ్’కు మూడేళ్లు.. శ్రీదేవీని తలుచుకున్న బోనీ కపూర్
అందాల తార స్వర్గీయ శ్రీదేవి చరిత్ర వెండితెరపై సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఇండియన్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవీ. ఆ తరం ఇ తరం అని తేడా లేకుండా అందరి మదిలో సింహాసనం వేసుకుని మరి కూర్చోగల సత్తా శ్రీదేవికి ఉంది. తెలుగు, తమిళ, హిందీ అని తేడా లేకుండా భారతీయ చలనచిత్ర రంగంలో శ్రీదేవిది ఓ సుదీర్ఘ అధ్యాయం. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీదేవి తన నటనలోని మరో కోణాన్ని చూపించారు.
ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ వంటి చిత్రాల్లో శ్రీ దేవి నటనకు ముగ్దులు కాని వారెవ్వరూ ఉండరు. ఇక శ్రీ దేవి చివరగా నటించిన మామ్ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆమెకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ అవార్డును అందుకునే సమయానికి శ్రీదేవి భూలోకం లేదు. తమ కుటుంబ సభ్యులు ఆ అవార్డును అందుకుంటూ ఉంటే స్వర్గ లోకం నుంచి చూసి ఆనంద పడిపోయి ఉంటారు.

కూతురికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే తల్లి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించారు. మామ్ చిత్రానికి శ్రీదేవికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. నేటికి మామ్ రిలీజై మూడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా బోనీ కపూర్ ఎమోషనల్అయ్యాడు. 'సమయం ఎంత త్వరగా గడిచింది. మామ్ విడుదలై మూడేళ్లు గడుస్తోంది. శ్రీదేవి అద్భుత నటన ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌కు అవార్డు లభించింది. చిత్ర యూనిట్ అందరూ ఎంతో గొప్పగా పని చేశార'ని ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











