సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో మోసం, నిర్మాతపై బోనీ కపూర్‌పై కేసు

బాలీవుడ్ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త చిక్కుల్లో పడ్డారు. ప్రవీణ్ శ్యాం సేతి అనే వ్యక్తి బోనీ కపూర్‌తో సహా మరో ఇద్దరిపై కేసు పెట్టారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో తన వద్ద నుంచి కోట్లాది రూపాయలు మోసపూరితంగా తీసుకున్నారని ఆరోపిస్తూ ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

కేసు వివరాల్లోకి వెళితే.. ''సెలబ్రిటీ క్రికెట్ లీగ్ డైరెక్టర్ పవన్ జంగిద్ 2018లో తనను సంప్రదించారని, ఈ సారి లీగ్ జైపూర్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పెడుతున్నట్లు వెల్లడించారని, ఈ లీగ్ కోసం పలువురు బాలీవుడ్ తారలు జైపూర్ వస్తారని, అందులో పాల్గొంటారని తెలిపినట్లు వెల్లడించారు.

Boney Kapoor in Celebrity Cricket League controversy

ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో బోనీ కపూర్‌తో పాటు ముస్తాఫా రాజ్ భాగస్వాములుగా ఉన్నారని పవన్ జంగిద్ తెలిపారని, ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లీగ్ పూర్తయిన తర్వాత రెట్టింపు రాబడి వస్తుందని తనను నమ్మించాడని ప్రవీణ్ శ్యామ్ సేతి తెలిపారు. 2018 అక్టోబర్లో బోనీ కపూర్ జై పూర్ వచ్చారు, డిసెంబర్లో క్రికెట్ లీగ్ నిర్వహించబోతున్నట్లు మీడియా ద్వారా వెల్లడించినట్లు తెలిపారు.

బోనీ కపూర్ ప్రకటనతో సెలబ్రిటీ క్రికెట్ లీగల్ మీద రూ. 67 లక్షలు, నా స్నేహితుడు ఒకరు రూ. 32 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. అయితే డిసెంబర్లో ఎలాంటి క్రికెట్ లీగ్ జరుగలేదు. పవన్ జంగద్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరించాడని ప్రవీణ్ శ్యాం సేతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో మొత్తం రూ. 2 కోట్లకుపైగా మోసం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ శ్యాం సేతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X