శ్రీదేవి డెత్ సీన్: ప్రియా వారియర్‌ టీజర్ చూసి హర్ట్ అయిన బోనీ కపూర్, లీగల్ నోటీసులు!

Recommended Video

SRIDEVI BUNGALOW official First Teaser

వింక్ గర్ల్‌గా గతేడాది ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేసిన ప్రియా వారియర్... తాజాగా మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ అయింది. ఈ కేరళ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది.

అయితే ఈ టీజర్లో చూపించిన సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో ప్రియా వారియర్ శ్రీదేవి అనే ఫిల్మ్ స్టార్ పాత్రో నటించింది. టీజర్ చివర్లో ఆమె బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లు చూపించడంతో గతేడాది మరణించిన అతిలోక సుందరి శ్రీదేవి ఉదంతం ఉంటుందనే అనుమానాలు తెరపైకి వచ్చాయి.

లీగల్ నోటీసులు పంపిన బోనీ కపూర్

లీగల్ నోటీసులు పంపిన బోనీ కపూర్

ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ‘శ్రీదేవి బంగ్లా' దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు. లీగల్ నోటీసులు అందిన విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ మాంబల్లి ధృవీకరించారు. మా సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్. శ్రీదేవి అనేది కామన్ నేమ్ అని బోనీకి కూడా చెప్పాను. ఒక నటి పాత్ర చుట్టూ సినిమా ఉంటుంది. ఈ లీగల్ నోటీసులు ఎదుర్కోవడానికి తాము సిద్ధమే అని ప్రకటించారు.

ప్రియా వారియర్ మౌనం

ప్రియా వారియర్ మౌనం

ఈ చిత్రం అతిలోక సుందరి శ్రీదేవి జీవితం ఆధారంగా తెరకెక్కిందా? లేదా? అనే విషయంపై స్పందించడానికి ప్రియా వారియర్ నిరాకరించారు. సినిమా విడుదలయ్యే వరకు ఈ విషయం సస్పెన్స్ గానే ఉంచదలుచుకున్నట్లు తెలిపారు. లీగల్ నోటీసులపై స్పందించాలని హీరోయిన్ తండ్రిని మీడియా వారు కోరగా... అది దర్శక నిర్మాతలనే అడగాలని సూచించారు.

సంచలనం కోసమేనా?

సంచలనం కోసమే శ్రీదేవి పేరు ఈ సినిమాలోని పాత్రకు వాడుకోవడంతో పాటు... ఆమె చనిపోయిన విధంగా బాత్ టబ్ సీన్లు క్రియేట్ చేశారని తెలుస్తోంది. మరి ప్రయత్నం ప్రియా వారియర్ బాలీవుడ్ ఎంట్రీకి ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి.

ప్రియా వారియర్

ప్రియా వారియర్

కాగా... ప్రియా వారియర్ నటించిన తొలి చిత్రం ‘ఓరు అడర్ లవ్' తెలుగు తెలుగులో ‘లవర్స్ డే' గా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X