ప్రియమణితో శ్రీదేవి భర్త అసభ్య ప్రవర్తన.. అందరూ చూస్తుండగానే అక్కడ చేయి వేసి మరీ!
అందానికి అందం, నటనకు నటనతో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న హీరోయిన్ ప్రియమణి. సాదాసీదాగానే సినీ రంగం ప్రవేశం చేసిన ఆమె.. నేషనల్ అవార్డుతో సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఇండియాలోని ఎన్నో భాషల్లో సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో ఎక్కువ మూవీలు చేస్తోన్న ప్రియమణి.. తాజాగా మరో క్రేజీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ జోష్‌లో ఉన్న ఆమెతో ఫేమస్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ అసభ్యంగా ప్రవర్తించారు. ఆ వివరాలను మీరే చూసేయండి!
అత్యత్తమ నటనతో ఫిదా:తెలుగు సినిమాతోనే పరిచయం అయిన ప్రియమణి.. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడంలో వరుస సినిమాలు చేసింది. తద్వారా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ హవాను చూపించింది. ఇక, తమిళంలో వచ్చిన 'పరుత్తివీరన్' సినిమాకు గానూ ఉత్తమ జాతీయ నటిగా అవార్డును సైతం అందుకుంది. దీంతో ప్రియమణి క్రేజ్ దేశ వ్యాప్తంగా ఏర్పడింది.

పాన్ ఇండియా రేంజ్‌లో:సౌత్ ఇండియాలో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న ప్రియమణి.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లోనూ తెగ సందడి చేస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో హిట్లు అందుకున్న ఈ అమ్మడు. ఇటీవలే 'ఆర్టికల్ 370' అనే చిత్రం వంద కోట్లు కొల్లగొట్టింది. అలాగే, 'భామాకలాపం' అనే వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌లో కూడా నటించింది. ఇలా అన్నింట్లోనూ విజయవంతంగా దూసుకెళ్తోంది.
మరో హిట్ కొట్టేసిందిగా:స్టార్ హీరోయిన్ ప్రస్తుతం ప్రియమణి అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇలా ఇప్పుడు తమిళంలో 'క్వటేషన్ గ్యాంగ్', కన్నడంలో 'ఖైమారా' అనే సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే హిందీలో 'మైదాన్' అనే భారీ మూవీలో భాగం అయింది. ఇందులో అజయ్ దేవగణ్ హీరోగా నటించాడు. ఈ ఉగాదికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిట్ టాక్‌తోనూ డల్‌గా:అజయ్ దేవగణ్ - ప్రియమణి జంటగా ఫుట్‌బాల్ గేమ్ నేపథ్యంతో సాగే కథతో రూపొందిన 'మైదాన్' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ మూవీ తక్కువ స్పందననే అందుకుంది. ఫలితంగా మొదటి రోజు కొద్ది మొత్తంలోనే కలెక్షన్లను రాబట్టింది.
స్క్రీనింగ్‌లో షాకింగ్‌గా:'మైదాన్' సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి ముంబైలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి బాలీవుడ్‌లోని ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్.. హీరోయిన్ ప్రియమణితో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది.

అక్కడ చేయి వేశాడు:'మైదాన్' స్పెషల్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత బోనీ కపూర్.. ప్రియమణితో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో ఆయన ఆమె నడుము మీద, భుజం మీద చేతులు వేసి కనిపించారు. దీన్ని చాలా మంది తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ, కొంత మంది మాత్రం ఇలాంటివి బాలీవుడ్‌లో మామూలే అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











