బోనీ కపూర్ అసభ్య ప్రవర్తన.. కెమెరా క్లిక్స్.. ఛిఛీ అంటూ చీదరించుకున్న హీరోయిన్

టెక్నాలజీ బాగా విస్తరించడం సెలెబ్రెటీలకు కొన్ని సందర్భాల్లో లేని తలనొప్పి తెచ్చిపెడుతోంది. సాధారణంగానే కొందరు సెలెబ్రెటీలు ఒక్కచోట కలిశారంటే షేక్ హాండ్స్, కౌగిలింతలు కామన్. ఇందులో మేల్, ఫీమేల్ అనే తేడా అస్సలుండదు. ఇక ఇలాంటి సందర్భాల్లో కెమెరా క్లిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలాంటి ఓ సంఘటనే ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత బోనీ కపూర్‌ని అబాసు పాలు చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలేంటి? పూర్తిగా చూద్దామా..

 నెల క్రితం ఓ ఫంక్షన్‌లో

నెల క్రితం ఓ ఫంక్షన్‌లో

దాదాపు నెల రోజుల క్రితం ఓ ఫంక్షన్‌‌కి హాజరయ్యారు నిర్మాత బోనీ కపూర్‌. ఈ ఓ ఫంక్షన్‌‌కి బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరోయిన్లు కూడా వచ్చారు. అందులో ఒకరే ఊర్వశి రౌతెలా. ఆ సమయంలో బోనీ కపూర్ ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తుండగా.. ఊర్వశి రౌతెలా కూడా వచ్చింది. దీంతో ఆమెను దగ్గరగా రండి అంటూ ఫ్రెండ్లీగా టచ్ చేశారు బోనీ కపూర్.

టచింగ్ వీడియో.. సోషల్ మీడియాలో సెన్సేషన్

టచింగ్ వీడియో.. సోషల్ మీడియాలో సెన్సేషన్

కెమెరా క్లిక్స్ టకాటకా పడుతున్నాయి. సో ఒకే ఫ్రేమ్‌లో అందరూ కనిపించాలని భావించిన బోనీ కపూర్, ఊర్వశి రౌతెలాను దగ్గరగా రమ్మనే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఆమెపై చేయి వేశారు బోనీ. అయితే ఈ ఫొటోల్లో బోనీ కపూర్, ఊర్వశి నడుం పట్టుకున్నట్లుగా కనిపించింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఊర్వశితో బోనీ కపూర్ అసభ్య ప్రవర్తన

ఊర్వశితో బోనీ కపూర్ అసభ్య ప్రవర్తన

ఈ ఫోటోలు, వీడియోలు చూసి ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఊర్వశి రౌతెలాతో బోనీ కపూర్ అసభ్య ప్రవర్తన. పబ్లిక్‌గానే ఆమె నడుంపై చేయి వేశాడంటూ ప్రచారం చేశారు. ఇది గమనించిన ఊర్వశి రౌతెలా వెంటనే అప్రమత్తమై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. ఆ సమయంలో బోనీ కపూర్ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పేసింది.

నోరువిప్పిన ఊర్వశి రౌతెలా.. ఇదీ జరిగింది

నోరువిప్పిన ఊర్వశి రౌతెలా.. ఇదీ జరిగింది

అయినప్పటికీ ఆ వీడియో ఇంకా సెన్సేషన్ అవుతుండటంతో మరోసారి ఊర్వశి రౌతెలా నోరువిప్పింది. ఓవర్‌నైట్ వైరల్ అయిన ఆ వీడియో ద్వారా తప్పుడు ప్రచారం జరిగింది. అసలు బోనీ కపూర్ నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. బోనీ సర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. దయచేసి ఇలాంటివి నమ్మకండి.. అని తెలిపింది ఊర్వశి.

అందులో తప్పేముంది? ఎందుకింత ప్రచారం..

అందులో తప్పేముంది? ఎందుకింత ప్రచారం..

నేను బోనీ సర్ ఓ పెళ్లి వేడుకకు వెళ్ళాం. అక్కడ ఫోటోలకు పోజులిస్తుండగా.. ఆయన నా భుజంపై చెయ్యి వేసి పక్కకు జరగండి అన్నారు. అయినా అందులో తప్పేముంది? దీనికే మీడియా వర్గాలు బోనీ నా నడుం పట్టుకున్నారని, నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడని రాయడమేంటి? అని ప్రశ్నించింది ఊర్వశి రౌతెలా.

ఛిఛీ అంటూ చీదరించుకున్న హీరోయిన్

ఛిఛీ అంటూ చీదరించుకున్న హీరోయిన్

ఛిఛీ.. ఆ తప్పుడు వార్తలు చూసి నాకు అసహ్యమేసిందంటూ చీదరించుకుంది ఊర్వశి రౌతెలా. బహుశా కెమెరా క్లిక్స్ అన్నీ ఒకేసారి వెంటవెంటనే పడటం వల్ల నా నడుం పట్టుకుంటున్నట్లుగా ఫొటో క్లిక్ అయిందేమో! అంతేగానీ అక్కడ జరిగిందేమీ లేదు అని కన్ఫర్మ్ చేసింది ఊర్వశి రౌతెలా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X