ఆ పిచ్చి కోరికే ప్రాణం తీసింది.. తొలిసారి శ్రీదేవి మరణంపై నోరు విప్పిన నిర్మాత..
Sridevi: అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. అయితే.. ఆమె అకాల మరణం ప్రేక్షకులను మాత్రం తీరని లోటే. అయితే.. శ్రీదేవి మరణించిన దాదాపు ఐదు సంవత్సరాల తరువాత.. అందాల తార మృతిపై ఆమె భర్త బాలీవుడ్ దర్శకుడు బోనీకపూర్ తొలిసారి నోరు విప్పాడు. శ్రీదేవి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించి అభిమానులను నిర్గాంత పోయేలా చేశారు.
భారతీయ సినీ ప్రపంచంలో ప్రశంసలు పొందిన నటి శ్రీదేవి. ఇండస్ట్రీలో తొలిసారి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రీదేవి. ఈ అతిలోక సుందరి ఎంతో మంది స్టార్ హీరోలతో కలసి నటించింది. ఆమె తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తన నటనతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే.. శ్రీదేవి దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి 2018 ఫిబ్రవరి 24న తాను ఉంటున్నా హోటల్ లోని బాత్ టబ్ లో పడి మరణించింది.కానీ, శ్రీదేవీ అకాల మరణం ఇప్పటికీ మిస్టరీగా ఉండిపోయింది. ఆమె మరణంపై అభిమానుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

శ్రీదేవి భర్త బోని కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన భార్య మరణం విషాదం అంటూ తెలిపారు. 'శ్రీదేవి ఎప్పుడూ కూడా తన రూపం, అందం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరిచేది. తాను నటించే పాత్ర కోసం ఒక నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉండాలని భావించేది. అందుకోసం.. అందంగా కనిపించడానికి కఠినమైన నియమాలను, ఆహార అలవాట్లను పాటించేది. కొన్ని సార్లు ఆమె అలవాట్లు చూసి మేము కూడా ఆశ్చర్యపోయే వాళ్ళం' అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
బోని కపూర్ ఇంకా మాట్లాడుతూ.. 'అందం కోసం. శరీర సౌందర్యం కోసం తరుచుగా క్రాష్ డైట్ లను పాటించేదనీ, అంతేకాదు తాను అనుకున్న ఆక్రుతి వచ్చేవరకు వ్యాయామాలు చేసేది. అవసరమైతే.. తినడం కూడా మానేసేది. అందంగా ఉండాలనే కోరికతో తన ఆరోగ్యాన్ని కూడా పాటించుకునేది కాదు. తన ప్రయత్నాలు మమ్మల్నీ ఆందోళన కలిగించేలా ఉండేవి. శ్రీదేవి అనుకున్న రూపాన్ని పొందడం కోసం నిరంతరం శ్రమించేంది. శ్రీదేవికి పెళ్లైనా మొదటి నుంచే.. లో బీపీ సమస్య ఉండేది, ఆహారం నియమాల్లో భాగంగా తాను తినే ఆహరంలో ఉప్పు లేకుండా చూసుకునేంది.' అని పేర్కొన్నారు.

'ఒకవేళ.. రాత్రివేళ బయట హోటల్లో స్టే చేయాల్సి వచ్చినప్పుడూ.. డిన్నర్ లో సాల్ట్ లేకుండా ఆహారం తీసుకునేది. ఇలా చేయడం వల్ల తన ఆరోగ్యం దెబ్బ తిన్నది. అందం కోసం పాకులాడటంతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంది ' అంటూ నిర్మాత బోనీకపూర్ షాకింగ్ కామెంట్లు చేశారు. అందాల తార శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇన్ని రోజులు శ్రీదేవి మరణంపై స్పందించని బోని కపూర్ తాజాగా స్పందించడం, షాకింగ్ కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.


Click it and Unblock the Notifications











