ఆ మూడు శ్రీదేవి కోసమేనా.. ఆసక్తి కలిగిస్తున్న బోనీ కపూర్ నిర్ణయం!
శ్రీదేవి మరణం యావత్ భారతానికి షాక్ అని చెప్పొచ్చు. అప్పటి వరకు చలాకీగా తిరిగిన శ్రీదేవి.. ఆకస్మికంగా మరణించిందనే వార్త తెలియడంతో అంతా షాక్ కి గురయ్యారు. శ్రీదేవి కుటుంబం పరిస్థితి అయితే ఇక చెప్పలేం. దాదాపు మూడు రోజుల హైడ్రామా అనంతరం శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. కాగా శ్రీదేవి మరణం నుంచి ఆమె కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
శ్రీదేవి మరణం తరువాత ఆమె బయోపిక్ గురించి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. హీరోయిన్ గా శ్రీదేవికి ఉన్న ట్రాక్ రికార్డ్ మరే నటికి ఉండదేమో. ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలో శ్రీదేవి విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. దక్షణాది వారు రాణించడం కష్టమైన బాలీవుడ్ లో సైతం శ్రీదేవి విజయ బావుటా ఎగరవేసింది.

అలాంటి శ్రీదేవి జీవిత గాదని వెండితెరపై ఆవిష్కరించాలనే కోరిక చాలా మంది సినీ ప్రముఖుల మదిలో ఉంది. కానీ ఆ బాధ్యతని బోనీ కపూర్ భుజాలపైకి ఎత్తుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడు ఆసక్తికరమైన టైటిల్స్ ని బోనీ కపూర్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. శ్రీ, శ్రీదేవి, శ్రీ మామ్ అనే టైటిల్స్ ని బోనికపూర్ రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్స్ శ్రీదేవి బయో పిక్ కోసమే అనే వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి బయోపిక్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











