శ్రీదేవిది సహజ మరణం కాదు.. మృతికి ముందు ఏం జరిగిందంటే? నోరు విప్పిన బోని కపూర్
సినిమా తెరపై అతిలోక సుందరి శ్రీదేవీ ఆకస్మిక మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మరణం అందరిలోను తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె ఇకలేరనే వార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. శ్రీదేవీ తిరిగిరాని దూరాలకు వెళ్లి చాలా రోజులు అయినప్పటికీ.. ఇంకా అది నమ్మలేని నిజంలానే అనిపిస్తున్నది. ఇంకా ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు, అనేక సందేహాలు రేకెత్తుతూనే ఉన్నాయి. అయితే అలాంటి మిస్టరీ డెత్ గురించి ఆమె భర్త బోని కపూర్ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
2018 సంవత్సరంలో శ్రీదేవీ తన కుటుంబ వివాహ కార్యక్రమానికి దుబాయ్‌కి వెళ్లారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వెళ్లిన ఆమె అక్కడి స్టార్ హోటల్‌లో విగతజీవిగా మారారు. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం ఆమె మరణ వార్త దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. నమ్మలేని విధంగా మారిన ఆ వార్త నిజం కాకపోతే బాగుండు అనే భావన అందరిలోను అనిపించింది. కానీ ఆ చేదు నిజాన్ని దిగమించుకోలేక అభిమానులు నిర్ఘాంతపోయారు.

అయితే శ్రీదేవీ మరణం తర్వాత బోని కపూర్‌పై అనేక రూమర్లు, గాసిప్స్ మీడియాలో షికారు చేశాయి. దుబాయ్‌లో ఆమె మరణానికి కారణం ఆయనే అంటూ కొందరు పరోక్షంగా కామెంట్స్ చేశారు. 100 కోట్లకుపైగా ఇన్సూరెన్స్ కోసం శ్రీదేవీ మరణం సంభవించిందని కొందరు అవాకులు చెవాకులు పేల్చారు. అయితే తాజాగా బోని కపూర్ వచ్చిన అనేక ఆరోపణలకు సమాధానం చెప్పే విధంగా దుబాయ్ పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు.
శ్రీదేవీ మరణం గురించి సుదీర్గమైన విచారణ, దర్యాప్తు చేపట్టిన దుబాయ్ పోలీసులు తుది రిపోర్టును ఇటీవల వెల్లడించినట్టు బోని కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నిటికి ఆ రిపోర్టు జవాబు చెప్పేలా ఉంది. కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా మంచే జరుగుతుంది. నేను ఏది చెప్పినా వినే పరిస్థితుల్లో కొందరు లేరు అనే విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
బోనీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడిస్తూ.. శ్రీదేవీ మరణం సహజమైనది కాదు. ప్రమాదవశాత్తూ ఆమె మరణించారు. ఆమె మరణంపై సహజంగానే అనేక అనుమానాలు తలెత్తాయి. దాంతో నాపై లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించారు. వాళ్లు అనేక విధాలుగా నన్ను విచారించారు. అనేక కోణాల్లో వారు దర్యాప్తు చేశారు. చివరకు ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మృతి అని అధికారులు తేల్చారు అని బోని కపూర్ వెల్లడించారు.

శ్రీదేవీ మరణానికి ప్రధాన కారణం ఆమె చేసిన ప్రమాదకరమైన డైటింగ్. ఆమె చేసిన డైటింగ్‌పై ఫ్యామిలీ డాక్టర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కెమెరా ముందుకు వచ్చే ప్రయత్నంలో సన్నగా కనిపించడానికి చాలా రోజులు ఉప్పు కూడా తినలేదు. చాలా కాలం కడుపు మాడ్చుకొన్నారు. దాంతో ఆమె బరువు ఓ దశలో 46 కేజీలకు చేరింది. అలాంటి డేంజరస్ డైట్ పాటించడం వల్ల ఆమె మరణించారు అని బోని కపూర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











