మళ్లీ చిక్కుల్లో అమీర్ ఖాన్ సినిమా.. బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్!
అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య హిందీ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న ఈ సినిమా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే అది నెగటివ్ రాంగ్ రీజన్స్‌తో. గత కొన్ని వారాలుగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి యూజర్ల స్పందనతో నెటిజన్లు అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్‌లపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్నీ బాయ్ కాట్ చేయాలనీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అమీర్ ఖాన్, కరీనా కపూర్ చేసిన కొన్ని పాత ప్రకటనలపై సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా కోపంగా ఉన్నారు.
ఇప్పుడు ఈ సినిమాపై వారి ఆగ్రహం బయటకు వస్తోంది. 'బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా' అంటూ ట్విట్టర్‌లో ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ ట్రెండ్ జరిగింది. ఇక ఇప్పుడు సినిమా బహిష్కరణ చేయాలని ట్రెండ్‌లో ఉండటం ఇది రెండోసారి. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. యెప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమీర్, కరీనాపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు, బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా' ట్రెండింగ్‌లో ఉంది. ఇద్దరు స్టార్లు తమ పాత ప్రకటనలతో టార్గెట్ అయ్యారు.

నెపోటిజం గురించి కరీనా కపూర్ చేసిన ప్రకటన సహా అమీర్ ఖాన్ 'అసహనం' ప్రకటన వరకు వినియోగదారులు కోపంగా ఉన్నారు. ఇక ఈ చిత్రం హాలీవుడ్ 'ఫారెస్ట్ గంప్' సినిమాను బేస్ చేసుకుని తెరకెక్కించారు. అమీర్‌కు జోడీగా కరినా కపూర్ హీరోయిన్‌గా నటించింది. వయాకమ్18 స్టూడీయోస్‌తో కలిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల కృశమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఈ చిత్రం ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











