twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Laal Singh Chaddha నిషేధించండి.. యూపీలో భారీగా నిరసనలు.. సీఎం ఆదిత్యానాథ్‌కు సేన ఫిర్యాదు

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ లాల్ సింగ్ చద్దా చిత్రానికి హిందుత్వవాదులు సెగ తగిలింది. ఈ చిత్రాన్ని నిషేధించాలని సంతాన్ రక్షక్ సేన పిలుపు నిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో థియేటర్ల ముందు సంస్థ కార్యకర్తలు భారీగా నిరసనలు వ్యక్తం చేయడం వివాదంగా మారింది. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమా రీమేక్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజైంది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
    హిందూ దేవతలపై అనుచితంగా

    హిందూ దేవతలపై అనుచితంగా


    హిందూ దేవతలపై నటుడు అమీర్ ఖాన్ అనుచితంగా వ్యవహరిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా తన చిత్రాల్లో కంటెంట్‌ను జొప్పిస్తున్నారు. దర్శకుడు అద్వైత్ చందన్ తన సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారు అని సంతాన్ రక్షక్ సేన కార్యకర్తలు మండిపడ్డారు.

     యూపీలో భారీగా ర్యాలీలు

    యూపీలో భారీగా ర్యాలీలు


    ఉత్తర ప్రదేశ్‌లోని బేలుపూర్‌‌లోని ఐపీ విజయ మాల్ ఎదుట లాల్ సింగ్ చద్దా సినిమాను నిషేధించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మేమంతా సనాతన హిందూ ధార్మికులం. ఇలాంటి సినిమాను దేశంలో ప్రదర్శించకుండా మా కార్యక్రమాలను అడ్డుకొంటాం అని నటుడు అమీర్ ఖాన్‌ను హెచ్చరించారు.

    అమీర్ ఖాన్‌పై నిప్పులు చెరిగిన నేతలు

    అమీర్ ఖాన్‌పై నిప్పులు చెరిగిన నేతలు


    అమీర్ ఖాన్‌పై సేన యూత్ వింగ్ నేత చంద్ర ప్రకాశ్ సింగ్, ఉపాధ్యక్షుడు అరుణ్ పాండే నిప్పులు చెరిగారు. సనాతన హిందూ ధర్మానికి అమీర్ ఖాన్ వ్యతిరేకి. హిందూ దేవతలంటే గౌరవం లేదు. వారిపై అనుచితంగా వ్యవహరిస్తుంటారు అని మండిపడ్డారు.

    డోర్ టూ డోర్ క్యాంపెయిన్

    డోర్ టూ డోర్ క్యాంపెయిన్


    అమీర్ ఖాన్ నిర్మించిన లాల్ సింగ్ చద్దా సినిమాను నిషేధించాలని డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేస్తాం. ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రదర్శించకుండా చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరుతాం అని సేన నేతలు చెప్పారు.

     అమీర్ ఖాన్ హిందూ వ్యతిరేకి

    అమీర్ ఖాన్ హిందూ వ్యతిరేకి


    అయితే హిందూ దేవతలకు వ్యతిరేకి అంటూ వస్తున్న ఆరోపణలపై అమీర్ ఖాన్ స్పందించారు. ఒకవేళ నా మాటలు, చేతల పట్ల ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నట్లయితే నేను చింతిస్తున్ాను. ఎవరి మనసును నొప్పించడం నా అభిమతం కాదు. ఎవరైనా నా సినిమాను చూడవద్దనుకొంటే.. వారి అభిప్రాయలను గౌరవిస్తాను అని అమీర్ ఖాన్ తన సినిమాను బహిష్కరించాలని వస్తున్న డిమాండ్‌పై స్పందించారు.

     లాల్ సింగ్ సినిమా స్టోరి ఏమిటంటే?

    లాల్ సింగ్ సినిమా స్టోరి ఏమిటంటే?

    హాలీవుడ్ నటుడు టామ్ హంక్ నటించిన ఫారెస్ట్ గంప్ సినిమాను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మలిచి లాల్ సింగ్ చద్దాను అమీర్ ఖాన్ రూపొందించారు. ఈ చిత్రంలో అంగవైకల్యంతో బాధపడే అబ్బాయిగా, సైన్యంలో జవానుగా, చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించే లవర్‌గా తదితర షేడ్స్ ఉన్న పాత్రను అమీర్ ఖాన్ పోషించాడు. సినీ నటిని కావాలనే కోరికతో మాఫియా బారిన పడి అరెస్ట్ అయిన యువతిగా నటించారు. గతంలో మాఫియా కేసులో అరెస్ట్ అయిన మోనికా బేడి పాత్రను పోలిన పాత్రను పోషించారు.

    English summary
    UttarPradesh's Sanatan Rakshak Sena demands boycott or ban the Laal Singh Chaddah. They urged to UP CM Yogi Adityanath on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X