Uninstall Hotstar: ఆలియా, మహేష్‌భట్‌‌కు షాక్.. సడక్ 2 మూవీని బహిష్కరించండి!

బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ నటించిన, ఆమె తండ్రి మహేష్ భట్‌ రూపొందించిన సడక్ 2 చిత్రానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూడొద్దని సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. Uninstall Hotstar అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేయడంతో సడక్ 2 చిత్ర రిలీజ్‌పై చర్చ భారీగానే జరుగుతున్నది. ఇక ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

సడక్ మూవీకి సీక్వెల్‌గా

సడక్ మూవీకి సీక్వెల్‌గా


ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ రూపొందించిన వహించిన సడక్ చిత్రం 1991లో భారీ విజయాన్ని అందుకొన్నది. సంజయ్ దత్, పూజభట్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్‌గా సడక్ 2 రూపొందించారు. ఈ చిత్రంలో ఆలియాభట్, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించారు. సంజయ్ దత్ పాత్ర చుట్టే కథ తిరుగుతుందనే యూనిట్ వెల్లడించింది.

సుశాంత్ సింగ్ మరణం తర్వాత

సుశాంత్ సింగ్ మరణం తర్వాత

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. స్టార్ దర్శకులు, హీరోలు, నిర్మాతల పిల్లలకే ప్రోత్సాహం అందిస్తున్నారు. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారు. సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో వారి కుట్రలకు బలైపోతున్నారంటూ కరణ్ జోహర్, యష్ రాజ్ ఫిలింస్, ఆదిత్య చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ లాంటి ప్రముఖులపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.

రియా చక్రవర్తితో మహేష్ భట్‌కు సన్నిహిత సంబంధాలు

రియా చక్రవర్తితో మహేష్ భట్‌కు సన్నిహిత సంబంధాలు

ఇక సుశాంత్ మరణానికి రియా చక్రవర్తి కారణమనే ఆరోపణలు రావడం, ఆమెకు మహేష్ భట్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటం వివాదంగా మారాయి. మహేష్ భట్ సలహాలు, సూచనలతోనే సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చారనే ప్రచారం ఎమోషనల్‌గా మార్చింది. సుశాంత్ మరణం కేసులో రియాతోపాటు మహేష్ భట్‌ను ముంబై పోలీసులు విచారించారు.

సడక్ 2 ను బహిష్కరించండి

సడక్ 2 ను బహిష్కరించండి


ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న సడక్ 2 చిత్రంపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో బంధుప్రీతి, యువ నటీనటులను వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను బహిష్కరించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
హాట్‌స్టార్ యాప్‌ను డిలీట్ చేయండి

హాట్‌స్టార్ యాప్‌ను డిలీట్ చేయండి

దేశంలో కరోనావైరస్ వ్యాధి పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో సినిమా థియేటర్లలో సినిమాలు విడుదల ఆగిపోయింది. దీంతో ఎక్కువ సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌పై సడక్ 2 చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో నెటిజన్లు Uninstall Disney+ Hotstar app అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X