twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bollywood బాయ్‌కాట్‌ ఎఫెక్ట్.. నష్టం ఎంత వరకు వెళ్లిందంటే..?

    |

    సినిమా ఇండస్ట్రీ అనేది చాలా సెన్సిటివ్ అంశం అని చాలా మంది సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు. బయట ఎలాంటి విషయాలు జరిగినా కూడా ఎక్కువగా అందరి ఫోకస్ కూడా సినీ సెలబ్రిటీలపైనే ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మరి కొందరు తెలివిగా స్పందిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆ విషయంపై తొందరపాటులో మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.

    అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై బాయ్‌కాట్‌ నెగిటివ్ ట్రెండింగ్ ట్యాగ్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. చిన్న స్థాయి హీరోల నుంచి అగ్ర హీరోల వరకు ఆ ప్రభావం గట్టిగానే పడుతొంది. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గత కొంత కాలంగా బాయ్‌కాట్‌ బ్యాక్ వలన ఎంతగా నష్టపోయింది అనే వివరాల్లోకి వెళితే.

    ఇప్పటికి కూడా..

    ఇప్పటికి కూడా..

    ఇటీవల వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా అలాగే రక్షాబంధన్ సినిమాలపై నెగటివ్ ట్యాగ్స్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా లాల్ సింగ్ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలి అంటూ సోషల్ మీడియాలో రెండు మూడు వారాల పాటు నెటిజన్లు ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. దేశంలో అసమానత్వం పెరిగిపోతుంది అని అప్పుడెప్పుడో ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ ప్రభావం ఇప్పటికీ కూడా అతనిపై పడుతోంది అంటే విషయం ఎంత కఠినంగా మారిందో చెప్పనవసరం లేదు.

    కరణ్ జోహార్ పై..

    కరణ్ జోహార్ పై..

    మరోవైపు నిర్మాతలు దర్శకులు కూడా ఇలాంటి బాయ్‌కాట్‌ ట్యాగ్ నుంచి తప్పించుకోవడం లేదు. వారు గతంలో చేసిన మిస్టేక్స్ అలాగే దేశంపైన మతాల పైగానే అలాగే ఇతర విషయాలపై నెగిటివ్గా స్పందించినా కూడా బాయ్ కట్ చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ముఖ్యంగా కరణ్ జోహార్ అయితే సినీ తారల వారసులను మాత్రమే తెరపైకి తీసుకువస్తాడు అని మిగతా వాళ్ళని తొక్కేస్తాడు అనే విధంగా నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రభావం ఇటీవల లైగర్ సినిమాపై కూడా కొత్త చూపించినట్లు అనిపించింది.

    అందుకే సైలెన్స్

    అందుకే సైలెన్స్

    నెగిటివ్ బాయ్‌కాట్‌ ఎఫెక్ట్ దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరూ కూడా ఎదుర్కొన్న వారే. సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ అలాగే ఇతర ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఇతర హీరోలు కూడా బాయ్ కాట్ నెగటివ్ టాక్స్ తో సతమతమవుతున్నారు. ఒకవేళ ఈ విషయంపై స్పందించిన కూడా మళ్లీ ఇంకా ఎంత రాద్ధాంతం చేస్తారో అని చాలా వరకు సైలెంట్ గానే ఉండాల్సి వస్తోంది.

    సుశాంత్ ఫ్యాన్స్ కూడా

    సుశాంత్ ఫ్యాన్స్ కూడా

    యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పుడు ఎక్కువగా బాలీవుడ్ అగ్ర హీరోలపై నెగిటివ్ కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర సినిమాలో అతను హీరో అవ్వాల్సింది.. కానీ అతనికి ఛాన్స్ ఇవ్వకుండా రణ్ బీర్ కు అవకాశం ఇచ్చారు అని కరణ్ జోహార్ పై ఒక రేంజ్ లో ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ సినిమాపై సుశాంత్ అభిమానులతో పాటు చాలామంది సినిమాను బాయ్‌కాట్‌ చేయాలని అంటున్నారు.

    సైలెంట్ గా ఉండడం వలనే..

    సైలెంట్ గా ఉండడం వలనే..

    ఒక విధంగా ఈ బాయ్‌కాట్‌ నెగిటివ్ ట్యాగ్స్ కు మొదట్లోనే అడ్డుకట్ట వేసి ఉంటే అయిపోయేది. దాదాపు 2019 నుంచి బాయ్‌కాట్‌ టాక్స్ ఒక రేంజ్ లో సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి అనే టాక్ అయితే వినిపిస్తోంది. ఏదైనా జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా ఆ విషయంపై క్లారిటీ ఇస్తే అక్కడితో అది ఎండ్ అవుతుంది. కానీ బాలీవుడ్ తారలు భయపడి కొంత నెగిటివ్ బాయ్‌కాట్‌ పై స్పందించడం లేదు. అదే వారిపై ప్రభావం చూపిస్తుంది అని మరి కొందరు స్పందిస్తున్నారు.

     కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు

    కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు

    అయితే నిజంగానే బాయ్‌కాట్‌ నెగిటివ్ ట్యాగ్స్ ద్వారా సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూపుతోందా అంటే అది పూర్తిస్థాయిలో కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే దగల్ కంటే ముందే ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. ఇక ఆ తరువాత దంగాళ్ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఆలియా భట్ పై కూడా మొదట్లో చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ ఇచ్చాయి. ఇక ఆ తర్వాత ఆమె గంగుబాయి ఖతీయవాడి సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల కలెక్షన్స్ అందుకుంది. పూర్తి స్థాయిలో అయితే బాయ్‌కాట్‌ నెగటివ్ ట్యాగ్స్ సినిమా కంటెంట్ బై ప్రభావం చూపకపోవచ్చు అని అర్థమవుతుంది. సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే ఎవరూ ఆపలేరు అని కూడా మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Boycott trending tags effects on bollywood and behind the reasons
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X