Laal Singh Chaddha సినిమాపై రివ్యూ ఇచ్చి చిక్కుల్లో పడిన హృతిక్ రోషన్.. రాబోయే సినిమాకు డ్యామేజ్ స్టార్ట్!

సాధారణంగా స్టార్ హీరోలు వారి తోటి హీరోల సినిమాలు విడుదలైనప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా వాటిని వీక్షిస్తూ ప్రత్యేకంగా రివ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వారు చేసే కామెంట్స్ ఊహించని విధంగా రివర్స్ అవుతుంటాయి. రీసెంట్ గా హృతిక్ రోషన్ చాలా పాజిటివ్ గానే అమీర్ ఖాన్ సినిమాపై రివ్యూ ఇచ్చినప్పటికీ కూడా తేడా కొట్టేసింది. చివరికి ఇప్పుడు అతని సినిమాకి డ్యామేజ్ మొదలవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 సినిమాను చూసిన హృతిక్ రోషన్

సినిమాను చూసిన హృతిక్ రోషన్

ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే అయితే శనివారం రోజు కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ కూడా అమీర్ ఖాన్ మీద ఉన్న మంచి స్నేహభావంతోనే ఈ సినిమాను వెళ్లి ముంబైలో చూశాడు. అయితే సినిమా చూసిన తర్వాత అతను సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు..

మిస్ అవ్వకండి..

మిస్ అవ్వకండి..

ఇప్పుడే లాల్ సింగ్ చెడ్డా సినిమా చూశాను. సినిమా హృదయానికి మంచి అనుభూతిని ఇచ్చింది. ప్లస్‌లు మైనస్‌లను పక్కన పెడితే, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ జెమ్ మిస్ అవ్వకండి గాయ్స్! వెళ్ళండి! ఇప్పుడే వెళ్ళండి. చూడండి. ఇది అందంగా ఉంది. జస్ట్ బ్యూటిఫుల్'' అని హృతిక్ ట్వీట్ చేశాడు.

విక్రమ్ వేద సినిమాపై ఎఫెక్ట్

విక్రమ్ వేద సినిమాపై ఎఫెక్ట్

అయితే హృతిక్ రోషన్ అలా ట్విట్ చేశాడో లేదో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అతని తదుపరి సినిమాపై నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. విక్రమ్ వేద సినిమాను కూడా బహిష్కరించాలి అంటూ ఓ వర్గం వారు బాయ్ కాట్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇదివరకే లాల్ సింగ్ సినిమాపై తీవ్రస్థాయిలో బాయికాట్ ట్యాగ్ ట్రెండింగ్ లో కావాల్సినంత డ్యామేజ్ అయితే చేసింది.

నెగిటివ్ ట్యాగ్స్

నెగిటివ్ ట్యాగ్స్

గతంలో అమీర్ ఖాన్ దేశంపై చేసిన వ్యాఖ్యలు అలాగే చిత్ర యూనిట్ సభ్యులపై ఇతర తప్పులను కారణాలను గుర్తు చేసుకున్న నెటిజన్లు ఆ సినిమాను బహిష్కరించాలి అంటూ నెగిటివ్ ట్యాగ్స్ అయితే ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ ఆ సినిమా అద్భుతంగా ఉంది వెళ్లి చూడండి అని అనగానే మీ సినిమాను కూడా మేము చూడము అంటూ విక్రమ్ వేద సినిమాను కూడా బాయ్ కాట్ చేస్తున్నాము అంటూ చాలామంది నెటిజన్లు స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

సెప్టెంబర్ 30న విడుదల

సెప్టెంబర్ 30న విడుదల

ఇక సోషల్ మీడియాలో నిమిషాల్లోనే బాయ్ కాట్ అంటూ విక్రమ్ మీద ట్యాగ్స్ ట్రెండింగ్ లిస్టులో చేరిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఈ విషయంలో హృతిక్ రోషన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇక తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న విక్రమ్ వేద సినిమాను హిందీలో హృతిక్ రోషన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఒరిజినల్ దర్శకులు పుష్కర్ గాయత్రి ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. మరొక ముఖ్యమైన పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడు. మరి ఇప్పుడు బాయ్ కాట్ విమర్శలతో ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల అయితే ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X