‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ డేట్ ఖరారు... విష్ణు మూర్తి పాత్రలో నాగార్జున!
అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, డింపుల్ కపాడియా, అక్కినేని నాగార్జున మౌనీ రాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.
ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ రెండేళ్ల క్రితం ప్రకటించాడు. అయితే సినిమా సెట్స్ మీదకు రావడానికి చాలా సమయం తీసుకుంది. 2019 ఆగస్టు లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ ఇపుడు నిర్ణయం మారింది.
తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ బట్టి రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. మొదటి భాగం 2019 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
2019 ఆగస్టు 15న అక్షయ్ కుమార్ నటిస్తున్న 'మిషన్ మంగళ్' విడుదల ఉండటంతో 'బ్రహ్మాస్త్ర'ను క్రిస్మస్ హాలిడే సీజన్లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. షూటింగ్ విషయానికొస్తే...ఈ చిత్రం బల్గేరియాలో జరుగుతుండగా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. బల్గేరియా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ముంబైలో తర్వాతి షెడ్యూల్ జరుగనుంది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ బ్రహ్మదేవుడి పాత్రలో, డింపుల్ కపాడియా సరస్వతీ దేవి పాత్రలో, అక్కినేని నాగార్జున విష్ణు మూర్తి పాత్రలో నటిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ పాత్రల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇందులో రణబీర్ సూపర్ పవర్స్ ఉన్న దేవం శర్మ/డ్రాగన్ పాత్రలో నటిస్తున్నాడు. అలియా భట్ తారా బజ్వా అనే కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











