150 డ్రోన్లతో ఆకాశంలో బ్రహ్మాస్త్ర లోగో లాంచ్ (ఫోటోస్)
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ 'బ్రహ్మాస్త్ర'. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ నాగార్జున కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరూ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆసిమ్ జబాజ్, గులాబ్ సింగ్ తన్వర్ నిర్మిస్తున్న ఈ సినిమా లోగో శివరాత్రి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాలో వినూత్నంగా లాంచ్ చేశారు.
150 డ్రోన్‌లతో లోగో ఆవిష్కరణ
లైట్స్ అమరిచ్చిన 150 డ్రోన్స్ ఉపయోగించి వినూత్నంగా ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర' టైటిల్ ఆవిష్కరించేలా చేశారు. ఈ తరహాలో ఒక సినిమా టైటిల్ ఆకాశంలో ఆవిష్కరింపజేయడం ఇండియన్ సినీ చరిత్రలో ఇదే తొలిసారి.

ప్రత్యేక పూజలు
కుంభమేళా ముగింపు సందర్భంగా ప్రయాగలో చిత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రణభీర్ కపూర్, అలియా భట్, దర్శకుడు అయాన్ ముఖర్జీ పాల్గొన్నారు.

ఈ ఏడాది మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మొదటి భాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25, 2019న విడుదల చేయబోతున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదొక విభిన్నమైన సినిమా కాబోతోందట.
‘బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మొదటి భాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25, 2019న విడుదల చేయబోతున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదొక విభిన్నమైన సినిమా కాబోతోందట.

నటీనటులు, టెక్నీషియన్స్
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రణవీర్ కపూర్, అలియా భట్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, డింపుల్ కపాడియా, విక్రమ్ గోఖలే, దివ్యేందు శర్మ, సౌరవ్ గుర్జార్, విశాల్ కార్వాల్, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా, టాప్ ప్లాట్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











